(బాలకృష్ణ, న్యూస్ 18, హైదరాబాద్)
దేశంలో నల్లధనం ప్రవాహాలపై ఈడీ దూకుడు పెంచింది. తాజాగా లైగర్ (Liger) మూవీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. లైగర్ విడుదలైన మూడు నెలల తరవాత ఈడీ అధికారులు ఇవాళ హైదరాబాద్(Hyderabad)లోని కార్యాలయంలో హీరో విజయ్ దేవరకొండను ప్రశ్నించారు. చిత్ర దర్శకుడు, సహ నిర్మాత అయిన పూరీ జగన్నాథ్ (Puri Jagannadh), నటి, సహ నిర్మాత ఛార్మీ కౌర్ (Charmi Kaur)కు ఇటీవల హైదరాబాద్ ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. వారిని ఈడీ అధికారులు ఒక దఫా ప్రశ్నించారు.
కాంగ్రెస్ నేత ఫిర్యాదు మేరకుకాంగ్రెస్ పార్టీ నాయకుడు బక్కా జడ్సన్ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ఫెడరల్ ఏజెన్సీ విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం ఉల్లంఘనపై విచారణ చేపట్టింది. లైగర్ పెట్టుబడులు అక్రమ మార్గాల ద్వారా వచ్చాయని జడ్సన్ తన ఫిర్యాదులో ఆరోపించారు. చాలా మంది రాజకీయ నాయకులు లైగర్ సినిమాలో బ్లాక్ మనీ పెట్టుబడులుగా పెట్టారని ఆయన ఫిర్యాదు చేశారు.నల్లధనాన్ని తెల్ల ధనంగా మార్చడానికి, పన్ను చెల్లింపుల నుండి తప్పించుకోవడానికి ఇది సులభమైన మార్గంగా కొందరు భావిస్తున్నారు. అనేక విదేశీ కంపెనీలు మోసపూరిత మార్గాల ద్వారా లైగర్ సినిమాలో పెట్టుబబుడు పెట్టాయని జడ్సన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
సిట్ విచారణకు భయమెందుకు..ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో వాడీవేడీగా వాదనలు..విచారణ
చిన్న చిత్రం భారీ పెట్టుబడి
హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం 5 భాషల్లో నిర్మాణమై, విడుదలైన ఈ చిత్రానికి ఏకంగా రూ.125 కోట్లు ఖర్చు చేశారు. అయితే లాభాలు రాకపోగా, పెట్టుబడిని కూడా తిరిగి పొందడంలో లైగర్ ఘోరంగా విఫలమైంది. ఫెమాను ఉల్లంఘించి విదేశాల నుంచి వచ్చిన పెట్టుబడులతో లైగర్ చిత్రాన్ని నిర్మించారని ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై దర్శక నిర్మాత పూరీ జగన్నాథ్‌ను, సహ నిర్మాతగా మారిన నటి ఛార్మి కౌర్‌ను ఈడీ ఇప్పటికే ప్రశ్నించింది.
టైసన్కూ సమన్లు ఇస్తారా..?
ఈ చిత్రంలో అమెరికన్ మాజీ ప్రొఫెషనల్ బాక్సర్ మైక్ టైసన్ తో పాటు, కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునే సాంకేతిక సిబ్బందితో సినిమాను తెరకెక్కించారు. టైసన్ కు చేసిన చెల్లింపుల గురించి, విదేశాల నుంచి వచ్చిన పెట్టుబడుల గురించి ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి, సహనిర్మాత ఛార్మీ కౌర్ ను ఈడీ ఇప్పటికే ప్రశ్నించింది. సహ నిర్మాత కరణ్ జోహార్ ను కూడా త్వరలో ఈడీ సమన్లు జారీ చేసి, ప్రశ్నించే అవకాశం ఉంది. కేవలం బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చేందుకు అక్రమ మార్గాల్లో విదేశాల నుంచి పెట్టుబడులు తరలించారనే కోణంలో ఈడీ అధికారులు విచారణలో పలు ప్రశ్నలు వేస్తున్నారు. పూరీ జగన్నాథ్, ఛార్మీ ఇంత భారీ పెట్టుబడులు పెట్టే స్తోమత వారికి లేదు కాబట్టి, అసలు పెట్టుబడులు ఎక్కడ నుంచి వచ్చాయనే దానిపై ఈడీ అధికారులు పలు ప్రశ్నలు సంధిస్తున్నట్టు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Enforcement Directorate, Liger Movie, Telangana, Vijay Devarakonda