Vijay Devarakonda | టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండకు యూత్‌లో ఏ విధమైన ఫాలోయింగ్ ఉందో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్నారు. ఈ సినిమా ఇచ్చిన విజయంతో ఎక్కడికో వెళ్లిపోయారు. టాలీవుడ్ రౌడీగా క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ సినిమాలు సైతం హిట్ కావడంతో విజయ్ కోసం నిర్మాతలు క్యూకట్టారు. ఆ తర్వాత ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘డియర్ కామ్రేడ్’ మూవీ ఫ్లాప్ అయింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడలో రిలీజ్ చేసినప్పటికీ సక్సెస్ కాలేదు. డియర్ కామ్రేడ్ ఘోరంగా విఫలమవడంతో విజయ్ ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.
ఐతే.. ఈ సినిమాను హిందీలో కరణ్ జోహార్ నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. కానీ ‘డియర్ కామ్రేడ్’ ఫ్లాప్ కావడంతో ఆ ప్రయత్నాలు చేయలేదు. కానీ విజయ్ దేవరకొండ ఇచ్చిన మాటతో ఇపుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండను ‘లైగర్’ మూవీతో హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు.
హీరోగా విజయ్ దేవరకొండకు తొలి ప్యాన్ ఇండియా మూవీ. ఆ సంగతి పక్కన పెడితే.. విజయ్ దేవరకొండ హీరోగా నటించి తెలుగులో ఫ్లాపైన ‘డియర్ కామ్రేడ్’ మూవీ హిందీలో మాత్రం ఓ రేంజ్లో ఇరగదీసింది. డియర్ కామ్రేడ్ చిత్రాన్ని హిందీ ప్రేక్షుకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. సినిమా స్టోరీతో పాటు విజయ్ యాక్టింగ్, విజయ్-రష్మిక రొమాన్స్ అదిరిపోయిందంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. 2020 జనవరి 19న యూబ్యూబ్‌లో విడుదలైన డియర్ కామ్రేడ్ హిందీ డబ్బింగ్ వెర్షన్ రికార్డుల మోత మోగిస్తోంది. యూట్యూబ్‌లో విడుదలైన 24 గంటల్లోనే 12 మిలియన్లు (కోటి 20 లక్షల) వ్యూస్ సాధించిది డియర్ కామ్రేడ్. అంతేకాదు ఇపుడు సరిగ్గా రెండేళ్ల వ్యవధిలో ఏకంగా 300 (30 కోట్లు) మిలియన్ వ్యూస్ రాబట్టి సంచలనం రేపింది.అంతేకాదు 3.5 లైక్స్ సంపాదించి రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసింది.
తెలుగులో నుంచి హిందీలో డబ్బింగ్ అయిన అల్లు అర్జున్, బోయపాటి శ్రీను మూవీ ‘సరైనోడు’తో పాటు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ‘జయ జానకి నాయక’ హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్‌లో 300 మిలియన్ వ్యూస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేశాయి. తాజాగా ’డియర్ కామ్రేడ్’ 300 మిలియన్ యూట్యూబ్ వ్యూస్‌తో విజయ్ దేవరకొండ ఈ ఫీట్ సాధించిన మూడో హీరోగా నిలిచారు. అది కూడా వరుసగా మూడు 300 మిలియన్ వ్యూస్ రాబట్టిన ముగ్గురు హీరోలు తెలుగు వారు కావడం గమనార్హం.
.@TheDeverakonda's Much Loved #DearComrade Becomes first south indian film to get 3.5 Million Likes in Hindi (Dubbing) with 300 Million views.?#VijayDeverakonda Craze.?? @iamRashmika @MythriOfficial@bharatkamma #LIGER pic.twitter.com/3mAA8lHl6r
— Vijay Deverakonda (@VijayDe78593148) January 20, 2022
భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన డియర్ కామ్రేడ్ చిత్ర తెలుగులో 2019 జులై 26న విడదలయింది. విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, రవి శంకర్, యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందించారు. డియర్ కామ్రేడ్ పాటలకు మంచి స్పందన వచ్చినప్పటికీ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది.
ఇక విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘లైగర్’ మూవీని ఈ యేడాది ఆగష్టు 25న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌కు మంచి రెస్సాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే కదా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood news, Dear Comrade, Liger Movie, Tollywood, Vijay Devarakonda