Home /News /movies /

LEGENDARY WRITER SIRIVENNELA SEETHARAMA SASTRY WRITTEN HIS LAST SONG FOR NANI SHAYAM SINGHA ROY MOVIE AND TEAM RELEASED THE SONG PROMO PK

Sirivennela Seetharama Sastry last song: ఇదే నా చివరి పాట.. చనిపోయే నెల ముందే ఆ దర్శకుడి చెప్పిన ‘సిరివెన్నెల’..

సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry)

సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry)

Sirivennela Seetharama Sastry last song: సిరివెన్నెల (Sirivennela Seetharama Sastry last song) మరణం ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈయన రాసిన చివరి పాట ఏమై ఉంటుందో అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే చనిపోయే ముందు వరకు కూడా ఈయన పాటలు రాస్తూనే ఉన్నారు.

ఇంకా చదవండి ...
తెలుగు సినిమా సాహితీ సౌరభానికి వన్నె తరగని ఎన్నో అద్భుతమైన పాటలను అందించి వెళ్లిపోయిన లెజెండరీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన కలం శాశ్వతంగా ఆగిపోయినా కూడా.. సిరివెన్నెల కురిపించే పాటలు మాత్రం ఎప్పుడూ శ్రోతలను అలరిస్తూనే ఉంటాయి. నవంబర్ 30న ఈయన అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే సిరివెన్నెల మరణం ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈయన రాసిన చివరి పాట ఏమై ఉంటుందో అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే చనిపోయే ముందు వరకు కూడా ఈయన పాటలు రాస్తూనే ఉన్నారు. విడుదలకు సిద్ధంగా ఉన్న ట్రిపుల్ ఆర్ సినిమాలో కూడా దోస్తీ పాట రాసింది శాస్త్రి గారే. అయితే 2019లోనే ఈ పాట రాసారు ఆయన. ఆ తర్వాత కూడా ఎన్నో సినిమాలకు పాటలు రాసారు సిరివెన్నెల. అయితే తాజాగా న్యాచురల్ నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో ఓ పాట రాసారు ఈయన. అదే ఈయన చివరి పాట అంటున్నారు దర్శక నిర్మాతలు. టాక్సావాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఈ సినిమాలోని 'సిరివెన్నెల' అనే మూడో పాటని డిసెంబర్ 7న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇది లెజెండరీ లిరిసిస్ట్ దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన చివరి పాట. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం కూడా వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో కూడా విడుదలైంది. ఈ సందర్భంగా నాని బాగా ఎమోషనల్ అయ్యాడు.

Balakrishna Akhanda: ఇదీ బాలయ్య పవర్.. ‘అఖండ’ కోసం థియేటర్స్‌కు వచ్చిన అఘోరాలు..


సిరివెన్నెల చాలా ప్రత్యేకమైన పాట.. ఎందుకంటే ఇది గ్రేటెస్ట్ లెజెండ్ సీతారామశాస్త్రి రచించిన చివరి పాట.. అలాగే ఆయన రాసిన మరో పాట కూడా త్వరలో విడుదల కానుందని తెలిపాడు నాని. తమ 'శ్యామ్ సింగరాయ్' సినిమాని సిరివెన్నెల గారికి అంకితం చేస్తున్నామని తెలిపాడు ఈయన. మరోవైపు దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ మాట్లాడుతూ.. నవంబర్ 3వ తేదీ రాత్రి తనకు సిరివెన్నెల గారు ఫోన్ చేసి 'ఆరోగ్యం బాగోలేదు. పాట పూర్తి చేయలేను.. ఎవరితోనైనా రాయిద్దాం' అని తెలిపారని.. దానికి తాను కూడా పర్లేదు సార్ అన్నానని తెలిపారు రాహుల్.

Heroes as Aghora: బాలకృష్ణ, విశ్వక్ సేన్, చిరంజీవి సహా ‘అఘోర’ పాత్ర చేసిన నటులు వీళ్ళే..


ఆ తర్వాత రోజు ఉదయం మళ్లీ ఆయనే కాల్ చేసి తనను నిద్ర లేపారని.. నవంబర్ 4న దీపావళి రోజు పల్లవి అయిపోయింది రాస్కో చెప్తాను అన్నారు. దాంతో వెంటనే పక్కనే ఉన్న మహాభారతం బుక్‌లో ఆ లైన్స్ రాసుకున్నట్లు తెలిపాడు దర్శకుడు రాహుల్. అద్భుతమైన ఆరు లైన్లతో పల్లవి ఇచ్చారు సిరివెన్నెల. అందులో మొదటి లైన్‌లోనే 'సిరివెన్నెల' అని సంతకం ఇచ్చారు ఈయన. ఎందుకు సార్ అని అడిగితే.. 'ఇదే నా చివరి పాట కావొచ్చు నాన్నా' అని గట్టిగా నవ్వారని గుర్తు చేసుకున్నాడు రాహుల్.


విధి ఏంటంటే ఈ పాట రికార్డింగ్ అయ్యే రోజు సిరివెన్నెల అంత్యక్రియలు అయ్యాయని చెప్పాడు రాహుల్ సంకృత్యాన్. పాట చాలా బాగా వచ్చింది.. మీరు వెళ్లిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని ఈ ప్రపంచానికి కొత్తగా పరిచయం చేయడానికి అవకాశం కల్పించినంనుకు టీమ్ తరపున థాంక్యూ సో మచ్.. మిస్సింగ్ యూ అంటూ ఎమోషనల్ అయ్యాడు దర్శకుడు రాహుల్. 'సిరివెన్నెల' పాటకు మిక్కీ జె మేయర్ స్వరాలు అందించగా.. యువ గాయకుడు అనురాగ్ కులకర్ణి పాడాడు. 'నెలరాజుని.. ఇలారాణి.. కలిపింది కదా సిరివెన్నెలా..' అంటూ సాగిన ఈ పాట ప్రోమో ఆకట్టుకుంటుంది. 'శ్యామ్ సింగరాయ్' చిత్రానికి సత్యదేవ్ జంగా కథ అందిస్తున్నారు. కలకత్తా నేపథ్యంలో వస్తున్న సినిమా ఇది. ఇందులో నాని రెండు పాత్రల్లో నటిస్తున్నాడు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసెంబర్ 24న విడుదల కానుంది శ్యామ్ సింగరాయ్.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Hero nani, Shyam Singha Roy, Sirivennela Seetharama Sastry, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు