ప్రముఖ నటి కన్నుమూత.. సోదరుడు చనిపోయిన మూడ్రోజులకే..

ఉషా గంగూలీ కన్నుమూత (usha ganguly death)

Usha Ganguly: ఇండస్ట్రీలో వరస విషాదాలు ఆగడం లేదు. వరసగా నటులు, దర్శకులు మరణిస్తూనే ఉన్నారు. గత నెల రోజుల్లోనే దాదాపు అరడజన్ మంది చనిపోయారు.

  • Share this:
ఇండస్ట్రీలో వరస విషాదాలు ఆగడం లేదు. వరసగా నటులు, దర్శకులు మరణిస్తూనే ఉన్నారు. గత నెల రోజుల్లోనే దాదాపు అరడజన్ మంది చనిపోయారు. ఇప్పుడు మరో ప్రముఖ నటి కన్ను మూసారు. బెంగాలిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఉషా గంగూలీ గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. తన ఫ్లాట్‌లో ఉషా గంగూలీ చలనం లేకుండా పడిపోయి ఉండడం గమనించిన ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఆమె భర్త కమలేందు కొన్నేళ్ల క్రితం మరణించారు.
ఉషా గంగూలీ కన్నుమూత (usha ganguly death)
ఉషా గంగూలీ కన్నుమూత (usha ganguly death)

ఆమె సోదరుడు మూడు రోజుల ముందే మరణించడం ఇక్కడ విషాదం. అంతలోనే ఉషా గంగూలీ కూడా చనిపోవడంతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు.. చిత్ర పరిశ్రమకి ఆమె చేసిన కృషిని గుర్తు చేసుకున్న మమతా 2016లో రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఉషా గంగూలీకి గిరీష్ సమ్మన్ గౌరవాన్ని అందజేసిందని చెప్పారు. ఉషా కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలియజేసారు మమతా బెనర్జీ. షబానా ఆజ్మీ, అపర్ణా సేన్ లాంటి సినీ ప్రముఖులు ఉషా మృతిపై సంతాపం వ్యక్తం చేసారు.
ఉషా గంగూలీ కన్నుమూత (usha ganguly death)
ఉషా గంగూలీ కన్నుమూత (usha ganguly death)

ఉషా గంగూలీ జోధ్‌పూర్‌లో జన్మించారు. చిన్నతనంలో భరతనాట్యం, హిందీ సాహిత్యంపై పట్టు సాధించారు. ఆ తర్వాత నాటక రంగంలో ప్రవేశించి మహాభోజ్, రుడాలి, కోర్ట్ మార్షల్స్, ఆంతర్యాత్ర లాంటి నాటకాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. నాటకాల్లోనే కాకుండా అజయ్ దేవగణ్, ఐశ్వర్యరాయ్ నటించిన రెయిన్ కోట్ చిత్రానికి దర్శకురాలు రితుపర్ణో ఘోషతో కలిసి కథను అందించారు. కరోనా నేపథ్యంలో సైలెంట్‌గా ఆమె అంత్యక్రియలు ముగిశాయి.
Published by:Praveen Kumar Vadla
First published: