ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజుకారోజుకు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ లాక్ డౌన్ సడలింపులతో వైరస్ మరింతగా విజృంభిస్తోంది. దీంతో ఇటు సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా దీని బారిన పడుతున్నారు. ఇప్పటికే అమితాబ్ కుటుంబ సభ్యులతో పాటు రాజమౌళి ఫ్యామిలీ మెంబర్స్ కరోనా బారిన పడి ఆ వ్యాధి నుండి కోలుకున్నారు. ఇప్పటికే ప్రముఖ లెజండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే కదా. బాలూను వైద్యులు హోం ఐషోలేషన్‌లో ఉండమని చెప్పినా.. కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టే ఉద్ధేశ్యం లేక ఆయన హాస్పటిల్‌లో జాయిన్ అయ్యారు. అంతేకాదు తనకు కరోనా సోకిన విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఆయన చెన్నైలోని ఓ కార్పోరేట్ హాస్పిటల్లో కోవిడ్‌కు చికిత్స తీసుకుంటున్నారు.
తాజాగా బాలూకు వైద్యం చేస్తోన్న డాక్టర్లు బాల సుబ్రహ్మణ్యం హెల్త్ కండిషన్ పై బులెటన్ విడుదల చేసారు. ప్రస్తుతం బాలూ గారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని తెలిపారు. ఆక్సిజన్ నిల్వలు సాధారణంగానే ఉన్నట్టు తెలిపారు. డాక్టర్లు ఆయన మైడిపెండెన్సీలో ఉంచి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్టు తమ బులెటిన్‌లో పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Corona virus, Covid-19, Kollywood, S. P. Balasubrahmanyam, Tollywood