తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం అనే తేడా లేకుండా దాదాపు అన్ని భారతీయ భాషల్లో పాటలు పాడి ఎన్నో జాతీయ పురస్కారాలు అందుకున్న గాయకుడు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఈయన ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో సినీ ప్రముఖులతో పాటు అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయనకు కరోనా సోకడంతో చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. కరోనా సోకడంతో పాటు వయసుతో పాటు వచ్చిన సమస్యలు తోడవడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం చెన్నై ఎంజిఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈయన ఆరోగ్యం కొన్ని రోజులుగా విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. ఆయన త్వరగా కోలుకోని పాటలు పాడాలనా సినీ ప్రముఖులతో పాటు కోట్లాది అభిమానులు ప్రార్ధిస్తున్నారు. తాజాగా ఆయన అభిమానులకు ఓ శుభవార్త. తాజాగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు జరిపిన టెస్టుల్లో ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చినట్టు చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లోని వర్గాలు ప్రకటించాయి. ఈ విషయాన్ని బాలు అబ్బాయి ఎస్పీ చరణ్ కన్ఫామ్ చేసాడు. అభిమానులు, సన్నిహితుల ప్రార్ధనలతో ఆయన కోలుకున్నట్టు తెలిపారు. ఆయన క్షేమంగా ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రార్ధించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona virus, Covid-19, Kollywood, S. P. Balasubrahmanyam, Tollywood