HOME »NEWS »MOVIE »legendary singer sp balasubrahmanyam latest tamil video song ennoda baasha from devadasu parvathy movie going viral pk

SP Balasubrahmanyam: యూ ట్యూబ్‌లో వైరల్ అవుతున్న ఎస్పీ బాలసుబ్రమణ్యం కొత్త పాట..

SP Balasubrahmanyam: యూ ట్యూబ్‌లో వైరల్ అవుతున్న ఎస్పీ బాలసుబ్రమణ్యం కొత్త పాట..
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (Photo/Facebook/SP Balu)

SP Balasubrahmanyam: గాన గంధర్వుడు, మధుర గాయకుడు, సంగీత స్వరరాగ చక్రవర్తి ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం జీర్ణించుకోలేని విషయం. 50 ఏళ్లుగా తన గాత్రంతో అందర్నీ మాయ చేసిన ఈ గానం మూగబోయింది. సెప్టెంబర్ 25 మధ్యాహ్నం 1.04 నిమిషాలకు..

  • Share this:
గాన గంధర్వుడు, మధుర గాయకుడు, సంగీత స్వరరాగ చక్రవర్తి ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం జీర్ణించుకోలేని విషయం. 50 ఏళ్లుగా తన గాత్రంతో అందర్నీ మాయ చేసిన ఈ గానం మూగబోయింది. సెప్టెంబర్ 25 మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ఆయన చనిపోయారు. ఆయన చనిపోయి 4 నెలలు గడిచినా కూడా ఇప్పటికీ బాలు స్వరంతో అలాగే ప్రేమలో ఉండిపోయారు. ఆయన స్వరాన్ని మరిచిపోవడం అనేది అసాధ్యం. ఎందుకంటే బాలు పాట లేకుండా రోజు గడవదు. ఆయన పాడిన తొలి పాట ఏంటంటే వెంటనే చెప్పొచ్చు. 1966లో శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న సినిమాలో పద్మనాభం కోసం పాడాడు బాలు. మరి ఆయన పాడిన చివరి పాట ఏంటి అనేది మాత్రం చాలా మందికి ఐడియా లేదు. ఎందుకంటే బాలు చనిపోయిన తర్వాత కూడా ఆయన పాడిన పాటలు ఒక్కొక్కటిగా విడుదల అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా మరో పాట విడుదలైంది. ఒక్కటి మాత్రం నిజం.. ఆయన చివరగా పాడింది తమిళ పాటే.. లాక్‌డౌన్‌కు కొన్నిరోజుల ముందు ఆయన పాట రికార్డు చేసారు. దేవదాస్ పార్వతి సినిమా కోసం ఆయన పాడిన ఎన్నోడ భాషా పాట ఇప్పుడు వీడియో విడుదలైంది. ఇందులో బాలు వాయిస్ విని అంతా కన్నీరు పెట్టుకుంటున్నారు. అందులో ఆయన ప్రేమ పాట పాడారు. 74 ఏళ్ల వయసులో కూడా బాలు స్వరం అతిమధురం అంటూ నివాళి అర్పిస్తున్నారు. ఇదిలా ఉంటే బాలు చివరగా రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘అన్నాత్తే’ సినిమా కోసం ఇంట్రడక్షన్ సాంగ్ పాడాడు.

గతేడాది విడుదలైన దర్బార్‌లో దుమ్ము దూళి అంటూ దుమ్ము లేపాడు బాలు. ఇప్పుడు కూడా శివ తెరకెక్కిస్తున్న అన్నాత్తే కోసం ఇంట్రో సాంగ్ పాడాడు బాలసుబ్రమణ్యం. అలా కన్ను మూయడానికి ముందు బాలు పాడిన చివరి పాట రజనీ ‘అన్నాత్తే’ సినిమాలోదే. రజినీ ఇంట్రో సాంగ్స్ ఎన్నో పాడాడు బాలు. ఇప్పుడు చివరి పాట కూడా అదే కావడం విశేషం. ఈ విషయాన్ని ఆ స్వయంగా అన్నాత్తే చిత్ర సంగీత దర్శకుడు డి.ఇమ్మాన్ వెల్లడించాడు. రజనీకాంత్ సైతం బాలుకు నివాళులు అర్పిస్తూ బాలు తన కోసం చివరగా పాడిన పాటను గుర్తు చేసుకున్నారు. మరి ఆ పాట ఎలా ఉండబోతుందో అని బాలు అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:January 18, 2021, 22:15 IST

टॉप स्टोरीज