బతికే ఉన్నా దయచేసి చంపేయొద్దు.. తప్పుడు వార్తలపై ఎస్ జానకి సీరియస్..

సింగర్ S. జానకి (Singer S Janaki)

S Janaki: బతికున్న వాళ్లను చచ్చిపోయారంటూ ప్రచారం చేయడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. అలా చేయడం ఎంత దారుణం అనేది కనీసం ఆలోచించలేని ఆకతాయీలు ఇప్పటికీ అలాగే చేస్తున్నారు.

  • Share this:
బతికున్న వాళ్లను చచ్చిపోయారంటూ ప్రచారం చేయడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. అలా చేయడం ఎంత దారుణం అనేది కనీసం ఆలోచించలేని ఆకతాయీలు ఇప్పటికీ అలాగే చేస్తున్నారు. ఇఫ్పుడు మరోసారి ఇద చేసారు. తాజాగా లెజెండరీ గాయని ఎస్ జానకి మరణించారంటూ సోషల్ మీడియాలో కొందరు వార్తలు వైరల్ చేసారు. అది చూసి అభిమానులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. దాంతో ఈ వార్తలపై ప్రముఖ గాయని ఎస్ జానకి వెంటనే స్పందించారు. వదంతులను నమ్మొద్దని.. వాటిని చూసిన అభిమానులు, సన్నిహితులు ఆందోళన చెందుతున్నారని ఆమె తెలిపారు.

సింగర్ S. జానకి (Singer S Janaki)
సింగర్ S. జానకి (Singer S Janaki)


తానెక్కడో ఉన్నానని.. అలాంటి సమయంలో ఇలాంటి తప్పుడు వార్తలు రాయడం ఏంటి అంటూ ఆమె ఆవేదన చెందుతున్నారు. తను చాలా ఆరోగ్యంగా ఉన్నానని.. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చెయ్యొదని ఆమె కోరాడు. దీనిపై జానకమ్మ కూడా చాలా అప్‌సెట్ అయింది. బతికున్న మనుషులపై ఇలాంటి తప్పుడు వార్తలు ఎలా సృష్టిస్తారో అస్సలు తెలియదని.. అలాంటి వాళ్లకు అస్సలు మనస్సాక్షి అనేది ఉందా అని ఆమె ప్రశ్నిస్తుంది.


సింగర్ S. జానకి (Singer S Janaki)
సింగర్ S. జానకి (Singer S Janaki)


ఎందుకు పదేపదే ఇలాంటి పిచ్చి వార్తలు సృష్టిస్తారు.. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది జానకి. దీనిపై ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా స్పందించారు. అమ్మ క్షేమంగా ఉందని.. సోషల్ మీడియాలో ఇలాంటి వదంతులు సృష్టిస్తున్న వాళ్లపై చర్యలు దారుణంగా ఉండాలని ఆయన కోరాడు. ఏంటీ చెత్త రాతలంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు బాలు. జానకమ్మ గురించి వార్త రాగానే చాలా మంది తనకు ఫోన్స్ చేసి మాట్లాడుతున్నారని.. దయచేసి ఇలాంటి వార్తలు రాయొద్దంటూ కోరాడు బాలు.
First published: