Home /News /movies /

LEGENDARY SINGER LATHA MANGESHKAR IS IN STILL HOSPITAL AND AN AUTO DRIVER GIVEN HIS INCOME FOR HER HEALTH PK

Latha Mangeshkar: లతా మంగేష్కర్ కోసం ఆటో డ్రైవర్ త్యాగం.. సంపాదించిందంతా దానం..

లతా మంగేష్కర్ Photo : Twitter

లతా మంగేష్కర్ Photo : Twitter

Latha Mangeshkar: లెజెండరీ గాయని లతా మంగేష్కర్ (Latha Mangeshkar) గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. భారతదేశ గాన కోకిల ఈమె. 50 ఏళ్లకు పైగానే తన పాటలతో ఎన్నో కోట్ల హృదయాలను రంజింపచేసింది ఈమె.

లెజెండరీ గాయని లతా మంగేష్కర్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. భారతదేశ గాన కోకిల ఈమె. 50 ఏళ్లకు పైగానే తన పాటలతో ఎన్నో కోట్ల హృదయాలను రంజింపచేసింది ఈమె. తనదైన ముద్ర వేయడమే కాకుండా.. మధురమైన గాత్రంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. కేవలం ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా లతకు అభిమానులున్నారు. కొన్ని రోజులుగా ఈమె అనారోగ్యంతో హాస్పిటల్‌లో ఉన్నారు. ఈమె ఆరోగ్యం దెబ్బ తిందని తెలిసిన దగ్గర్నుంచి అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ మధ్యే కరోనా సోకడంతో ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు లతా మంగేష్కర్.

కరోనాకు తోడు వయోభారం కూడా ఈమెకు శాపంగా మారుతుంది. వ్యక్తిగత అనారోగ్య సమస్యలు ఉండటంతో ఇంకా icuలోనే చికిత్స తీసుకుంటున్నారు లతా జీ. ఆమె ఆసుపత్రిలో చేరిన రోజు నుంచి లతా త్వరగా కోలుకోవాలని అభిమానులు, ప్రేక్షకులు దేవుడికి ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముంబైలోని ఓ ఆటో డ్రైవర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. చిన్నప్పటి నుంచి లతా మంగేష్కర్‌ అంటే ప్రాణమిచ్చే ఆయన.. ఇప్పుడు ఆమె ప్రాణం కోసం తన సంపాదన దానం చేస్తున్నాడు. లతాకు వీరాభిమాని అయిన సత్యవాన్ ఆమె చికిత్స కోసం తన సంపాదనను దానం చేసాడు.

Ram Charan - Shankar: తగ్గేదే లే.. ఒక్క పాట కోసం అన్ని కోట్లా.. రామ్ చరణ్ సినిమాలో శంకర్ సంచలనం..


గత 10 రోజులుగా ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు లత మంగేష్కర్. ఆమెను తన చిన్ననాటి నుంచి కూడా సరస్వతి దేవి స్వరూపంగా కొలుస్తున్నాడు సత్యవాన్. అలాంటి ఆమె ఇప్పుడు అనారోగ్యంతో బాధ పడుతున్న విషయం తెలిసి ఆయన కుంగిపోయాడు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న ఈయన.. తన సంపాదనను ఆమె కోసం ఇచ్చేస్తున్నాడు. సత్యవాన్ ఆటోలో కూడా పూర్తిగా లతా మంగేష్కర్‌ బొమ్మలతో పాటు ఆమె చెప్పిన మాటలే కనిపిస్తుంటాయి. ఆటో నడుపుతూ వచ్చే ఆదాయాన్నే ఆయన దానం చేస్తున్నాడని తెలిసిన తర్వాత మిగిలిన అభిమానులు ఆయన్ని ప్రశంసిస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Bollywood, Hindi Cinema, Latha Mangeshkar

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు