Home /News /movies /

Vijay Yesudas Accident: ప్రముఖ గాయకుడు విజయ్ యేసుదాస్‌కు రోడ్డు ప్రమాదం..

Vijay Yesudas Accident: ప్రముఖ గాయకుడు విజయ్ యేసుదాస్‌కు రోడ్డు ప్రమాదం..

విజయ్ యేసుదాస్ (vijay yesudas)

విజయ్ యేసుదాస్ (vijay yesudas)

Vijay Yesudas Accident: లెజెండరీ గాయకుడు కేజే యేసుదాస్ తనయుడు, నేపథ్య గాయకుడు విజయ్‌ యేసుదాసు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ విషయం తెలుసుకుని అభిమానులు కంగారు పడుతున్నారు. కొచ్చిలో ఈ ప్రమాదం జరిగింది.

లెజెండరీ గాయకుడు కేజే యేసుదాస్ తనయుడు, నేపథ్య గాయకుడు విజయ్‌ యేసుదాసు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ విషయం తెలుసుకుని అభిమానులు కంగారు పడుతున్నారు. కొచ్చిలో ఈ ప్రమాదం జరిగింది. నవంబర్ 2 అర్ధరాత్రి ఆయన ప్రయాణిస్తున్న కారు మరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఎదురు నుంచి వచ్చిన మరో కారు ఈయన కారును బలంగా ఢీ కొట్టింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో విజయ్‌కు ఏం కాలేదు. ఆయన క్షేమంగానే బయట పడ్డారు. తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డామని వాళ్లు తెలిపారు. అసలు ఏం జరిగిందంటే తిరువనంతపురం నుంచి కొచ్చికి తన స్నేహితుడితో కలిసి కారులో బయలుదేరాడు విజయ్‌. ఆ సమయంలో ఆయనే స్వయంగా కారు నడుపుతున్నాడు. అయితే రాత్రి 11.30 గంటల సమయంలో జాతీయ రహదారిపైకి అకస్మాత్తుగా మరో కారు వచ్చింది. అనుకోకుండా అడ్డుగా రావడంతో ఒక్కసారిగా రెండు కార్లు ఢీ కొట్టుకున్నాయి. దాంతో రెప్పపాటులో ప్రమాదం జరిగింది.

vijay yesudas,vijay yesudas twitter,vijay yesudas car accident,vijay yesudas car accident escape,vijay yesudas songs,విజయ్ యేసుదాస్,విజయ్ యేసుదాస్ రోడ్డు ప్రమాదం
విజయ్ యేసుదాస్ (vijay yesudas)


ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అసలేం జరిగిందో విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంలో విజయ్ కారుతో పాటు అటువైపు నుంచి వచ్చిన కారు కూడా నుజ్జునుజ్జు అయింది. వెంట్రుక వాసిలోనే ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డాడు విజయ్ యేసుదాస్. ప్రమాదం తర్వాత విజయ్‌, అతని స్నేహితుడు మరో కారులో కోచికి వెళ్లిపోయారు. విజయ్ ప్రమాదం గురించి తెలుసుకుని సినీ ప్రముఖులతో పాటు సన్నిహితులు కూడా సోషల్ మీడియాలో ఆయన క్షేమ సమాచారం గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ప్రముఖ నేపథ్య గాయకుడు కె.జె.యేసుదాసు తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమైనా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నాడు విజయ్.

vijay yesudas,vijay yesudas twitter,vijay yesudas car accident,vijay yesudas car accident escape,vijay yesudas songs,విజయ్ యేసుదాస్,విజయ్ యేసుదాస్ రోడ్డు ప్రమాదం
విజయ్ యేసుదాస్ (vijay yesudas)


ఇప్పటికే తెలుగులో కూడా ఎన్నో పాటలు పాడాడు. మొన్నటికి మొన్న ఉమామహేశ్వరలో ఈయన పాడిన నింగి చుట్టే పాట సంచలనం సృష్టించింది. దాంతో పాటు చాలా పాటలు పాడాడు. మలయాళంలో ఎన్నో వందల పాటలకు గానం అరువిచ్చాడు విజయ్ యేసుదాస్. అయితే మలయాళంలో గాయకులకు సరైన గుర్తింపు లేదంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అసహనం వ్యక్తం చేసిన విజయ్‌.. ఇకపై సొంత భాషలో పాడనని చెప్పాడు. కేవలం తెలుగు, తమిళ పాటలు పాడతానని ఈ సందర్భంగా తెలిపాడు విజయ్ యేసుదాస్.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Malayala Cinema, Telugu Cinema

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు