43 ఏళ్ల తర్వాత రజినీకాంత్, కమల్ హాసన్ చిత్రం మళ్లీ విడుదల..

Pathinaru Vayathinile: లోక నాయకుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ రజినీకాంత్, దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి కలిసి నటించిన సినిమా పదినారు వయదినలే. లెజెండరీ దర్శకుడు భారతీరాజా తెరకెక్కించిన ఈ చిత్రం..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 12, 2020, 9:35 PM IST
43 ఏళ్ల తర్వాత రజినీకాంత్, కమల్ హాసన్ చిత్రం మళ్లీ విడుదల..
16 వయదినిలే సినిమా (16 vayathinile movie)
  • Share this:
లోక నాయకుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ రజినీకాంత్, దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి కలిసి నటించిన సినిమా పదినారు వయదినలే. లెజెండరీ దర్శకుడు భారతీరాజా తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. 43 ఏళ్ల కింద అంటే 1977లో విడుదలైన ఈ తమిళ చిత్రం అప్పట్లో రికార్డులు తిరగరాసింది. ఇందులో రజినీకాంత్ ప్రతినాయకుడిగా నటించాడు. ఈ చిత్రం అప్పట్లో నాలుగు తమిళనాడు రాష్ట్ర పురస్కారాలను సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడిగా కమల్ హాసన్.. ఉత్తమ దర్శకుడిగా భారతీరాజా.. ఉత్తమ సంగీత దర్శకుడిగా ఇళయరాజా.. ఉత్తమ నేపథ్య గాయనిగా ఎస్. జానకి ఈ పురస్కారాలు అందుకున్నారు.
16 వయదినిలే సినిమా (16 vayathinile movie)
16 వయదినిలే సినిమా (16 vayathinile movie)


ఇదిలా ఉంటే ఉత్తమ గాయనిగా జానకి ఇదే సినిమాకు జాతీయ పురస్కారాన్ని.. ఫిలిం ఫేర్ అవార్డు కూడా సొంతం చేసుకోవడం గమనార్హం. తెలుగులో ఈ సినిమాను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు 'పదహారేళ్ళ వయసు' పేరుతో రీమేక్ చేసాడు. ఇక్కడ కూడా శ్రీదేవి హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంతోనే తెలుగులో సూపర్ స్టార్ అయిపోయింది శ్రీదేవి.
16 వయదినిలే సినిమా (16 vayathinile movie)
16 వయదినిలే సినిమా (16 vayathinile movie)

తెలుగులో కమల్ పాత్రలో చంద్రమోహన్, రజినీ పాత్రలో మోహన్ బాబు నటించారు. ఇక్కడ కూడా సంచలన విజయాన్ని అందుకుంది ఈ చిత్రం. ఇప్పుడు తమిళ పదహారేళ్ల వయసు సినిమాను తెలుగులో డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌తో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి తెలుగులో 'నీకోసం నిరీక్షణ' అని టైటిల్ పెట్టారు.
పదహారేళ్ల వయసు పోస్టర్ (padaharella vayasu poster)
పదహారేళ్ల వయసు పోస్టర్ (padaharella vayasu poster)

ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సుప్రీమ్ ఆల్మైటీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ సందర్భంగా నిర్మాత బామా రాజ్ కణ్ణు మాట్లాడుతూ.. ''అద్భుతమైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూస్తారని నమ్ముతున్నాము.. ఈ మధ్యే ఆదిత్య మ్యూజిక్‌లో విడుదలైన 5 పాటలకు మంచి స్పందన వస్తుంది.. సుమారు 30 నిముషాల నిడివి దృశ్యాలను తెలుగు ప్రేక్షకుల అభిరుచిగా తగ్గట్లుగా మార్పులు చేసి మీ ముందుకు తీసుకువస్తున్నాం'' అని తెలిపారు.
Published by: Praveen Kumar Vadla
First published: June 12, 2020, 9:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading