హోమ్ /వార్తలు /సినిమా /

Prathima Devi: ప్రముఖ కన్నడ నటి కన్నుమూత.. ముఖ్యమంత్రి సంతాపం..

Prathima Devi: ప్రముఖ కన్నడ నటి కన్నుమూత.. ముఖ్యమంత్రి సంతాపం..

Prathima Devi: లెజెండరీ కన్నడ నటి ప్రతిమా దేవి (Prathima Devi) కన్నుమూసారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. కొన్ని రోజులుగా ఈమె అనారోగ్యంతో బాధ పడుతున్నారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు ప్రతిమా దేవి. దాదాపు 74 సంవత్సరాల నట అనుభవం ఈమె సొంతం.

ఇంకా చదవండి ...

సినిమా ఇండస్ట్రీలో వరస విషాదాలు జరుగుతున్నాయి. తాజాగా మరో లెజెండరీ నటి కన్నుమూసారు. ఆమె పేరు ప్రతిమా దేవి. ఆమె వయసు 88 సంవత్సరాలు. కొన్ని రోజులుగా ఈమె అనారోగ్యంతో బాధ పడుతున్నారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు ప్రతిమా దేవి. దాదాపు 74 సంవత్సరాల నట అనుభవం ఈమె సొంతం. 1947లో దేశానికి స్వాంతంత్య్రం వచ్చినపుడు ఈమె నటన కూడా మొదలు పెట్టారు. కన్నడలో 1947లో విడుదలైన కృష్ణలీల సినిమాతో ప్రతిమా దేవి హీరోయిన్‌గా నటించారు. ఆ తర్వాత దాదాపు 75 సినిమాల్లో నటించారు ఈమె. కన్నడ నాట 100 రోజులు ఆడిన తొలి సినిమా జగన్మోహినిలో కూడా ఈమె నటించారు. 1951లో విడుదలైంది ఈ చిత్రం. 1932, ఎప్రిల్ 9న జన్మించిన ప్రతిమా దేవి.. పుట్టిన రోజుకు మూడు రోజుల ముందు మరణించారు. కన్నడలో ఈమె నటించిన కృష్ణలీలా, చంచల ఉమరి, శివశరణే నమియక్క, మంగళ సూత్రం వంటి చిత్రాలు మంచి విజయం సాధించడమే కాకుండా ప్రతిమా దేవికి నటిగానూ గుర్తింపు తీసుకొచ్చాయి. జగన్మోహిని సినిమాలో ప్రతిమా దేవి నటనకు మంచి మార్కులు పడ్డాయి.

నటిగా బిజీగా ఉన్న సమయంలోనే వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు శంకర్ సింగ్‌ను ప్రతిమా దేవి వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ ముగ్గురు కూడా ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు.

kannada actress Prathima Devi,kannada actress Prathima Devi death,Prathima Devi passed away,kannada actress Prathima Devi dies,kannada cinema,కన్నడ నటి ప్రతిమా దేవి కన్నుమూత,లెజెండరీ నటి ప్రతిమా దేవి కన్నుమూత
లెజెండరీ నటి ప్రతిమా దేవి కన్నుమూత (kannada actress Prathima Devi)

ప్రతిమా దేవీ మృతిపై ముఖ్యమంత్రి యడియూరప్ప సంతాపం వ్యక్తం చేశారు. కన్నడ చిత్ర పరిశ్రమలో ఓ లెజెండరీ నటి కన్ను మూసారని.. కన్నడ సినిమాపై ఆమె చెరగని ముద్ర వేశారని.. ఎంతో ప్రతిభావంతమైన నటిని పరిశ్రమ కోల్పోయిందని తెలిపారు. పలువరు సినీ ప్రముఖులు కూడా ఈమె మృతిపై సంతాపం వ్యక్తం చేసారు.

First published:

Tags: Kannada Cinema

ఉత్తమ కథలు