Home /News /movies /

LEGENDARY DIRECTOR SINGEETHAM SRINIVASA RAO WIFE LAKSHMI KALYANI PASSESED AWAY SB

Tollywood: సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం !

సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం

సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం

సింగీతం భార్య లక్ష్మీ కళ్యాణీ చెన్నయ్ లో శనివారం రాత్రి కన్నుమూశారు. 1960లో సింగీతం శ్రీనివాసరావు, లక్ష్మీకల్యాణిల వివాహం జరిగింది. 

    తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటు చేసుకుంది. లెజండరీ డైరెక్టర్, వైవిధ్య భరితమైన చిత్రాలను తెరకెక్కించిన సింగీతం శ్రీనివాసరావుకు( Singeetam Srinivasa Rao) సతి వియోగం కలిగింది. ఆయన భార్య లక్ష్మీ కళ్యాణీ చెన్నయ్ లో శనివారం రాత్రి కన్నుమూశారు. 1960లో సింగీతం శ్రీనివాసరావు, లక్ష్మీకల్యాణిల వివాహం జరిగింది.  సింగీతం భార్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. శనివారం రాత్రి చికిత్స తీసుకుంటూ చెన్నై హాస్పిటల్ లో మృతి చెందారు. భార్య మృతి చెందిన వార్తను సోషల్ మీడియా ద్వారా సింగీతం శ్రీనివాసరావు తెలిపారు. 62 సంవత్సరాల తమ దాంపత్య జీవితానికి తెరపడిందని ఆయన అన్నారు.

    ఆయన సినీ కెరీర్‌లో ఆమె కూడా కీలక పాత్ర పోషించారు. పలు సినిమాలకు స్క్రిప్ట్‌ రాయడంలో ఆయనకు సహాయం చేసేశారు. భార్య కోసం సింగీతం శ్రీనివాసరావు ఏకంగా ‘శ్రీకల్యాణీయం’అనే ఓ పుస్తకాన్ని కూడా రాశారు. సినీ ప్రయాణం గురించి, అందులో తన ప్రమేయం గురించి, పిల్లల పెంపకం గురించి సింగీతం లక్ష్మీ కళ్యాణీ ‘శ్రీ కళ్యాణీయం’ పేరుతో పదేళ్ళ క్రితం ఆత్మకథను రాసి, పుస్తకంగా తీసుకొచ్చారు.


    యుక్త వయసులోనే చిత్రసీమలోకి అడుగుపెట్టిన సింగీతం శ్రీనివాసరావుకు అరవైయేళ్ళకు పైగా ఆమె చేదోడు వాదోడుగా ఉన్నారు. ప్రస్తుతం సింగీతం శ్రీనివాసరావు సినిమాలకు దూరంగా ఉంటున్నారు.  ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కు హాజరు కావడం సింగీతం శ్రీనివాసరావుకు అలవాటు. అయితే తనతో పాటుగా ఆయన ఎన్నో విదేశాలకు, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు భార్య కళ్యాణిని కూడా వెంట తీసుకెళ్ళేవారు. ఆ తర్వాత ఆమెతో కలిసి ఆ సినిమాలు, వాటి కథాకమామీషుపై చర్చించేవారు. ఆమె మృతిపట్ల సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Singeetam Srinivasa Rao, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు