Home /News /movies /

LEGENDARY DIRECTOR RAGHAVENDRA RAO HOT COMMENTS ON SAMANTHA AKKINENI DRESS IN JAANU THANKS MEET PK

సమంత డ్రెస్‌ నాకు కావాలి.. రాఘవేంద్రరావు కొంటె కామెంట్స్..

సమంత రాఘవేంద్రరావు (samantha raghavendra rao)

సమంత రాఘవేంద్రరావు (samantha raghavendra rao)

Raghavendra Rao: ద‌ర్శ‌కేంద్రుడు రాఘవేంద్ర‌రావు ఇప్పుడు సినిమాల‌కు దూరంగా ఉన్నారు. కొన్నేళ్లుగా ఈయ‌న ఎలాంటి సినిమాలు చేయ‌డం లేదు. హాయిగా త‌న పెద్ద‌రికాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కేంద్రుడు.

ద‌ర్శ‌కేంద్రుడు రాఘవేంద్ర‌రావు ఇప్పుడు సినిమాల‌కు దూరంగా ఉన్నారు. కొన్నేళ్లుగా ఈయ‌న ఎలాంటి సినిమాలు చేయ‌డం లేదు. హాయిగా త‌న పెద్ద‌రికాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కేంద్రుడు. ఈయన పెద్దరికం యూజ్ చేసుకుంటూ ఇండస్ట్రీలో కొందరు తమ సినిమాలకు ముఖ్య అతిథిగా ఈయన్ని తీసుకొస్తున్నారు. తాజాగా జాను సక్సెస్ మీట్‌కు వచ్చాడు. ఇది వ‌ర‌కు అయితే ఆయ‌న మౌన‌ముని. కానీ కొన్నేళ్లుగా ద‌ర్శ‌కేంద్రుడు మాట్లాడుతున్నాడు. దాంతో ప్ర‌తీ వేడుక‌కు వ‌చ్చి సినిమాల గురించి నాలుగు మంచి ముక్క‌లు చెబుతున్నాడు ఈయ‌న‌.
సమంత రాఘవేంద్రరావు (samantha raghavendra rao)
రాఘవేంద్రరావు పూజా హెగ్డే (Source: Twitter)

రాఘవేంద్రుడి మాట‌లు ఇప్పుడు సంచ‌లనం సృష్టిస్తున్నాయి. 'జాను' థ్యాంక్స్ మీట్‌లో ఈయన మాటలు ఆసక్తి పుట్టించాయి. ఇందులో సమంత డ్రెస్‌పై రొమాంటిక్ కామెంట్స్ చేశాడు దర్శకేంద్రుడు. సినిమాలో సమంత ఓ కుర్తాను చాలా సేపు వేసుకుని ఉంటుంది. అది వర్షంలో తడిచిన తర్వాత హీరో ఆరేస్తాడు. సినిమా చూశాక దాన్ని అడుగుదామనుకున్నా. కానీ, నేను రామచంద్రను కాదు.. రాఘవేంద్రరావును అని గుర్తొచ్చి మానేశానని ఆయన చెప్పుకొచ్చారు. ఇది విన్న తర్వాత అక్కడున్న వాళ్లంతా నవ్వుకున్నారు.
సమంత రాఘవేంద్రరావు (samantha raghavendra rao)
సమంత రాఘవేంద్రరావు (samantha raghavendra rao)

గతంలో కూడా పూజా హెగ్డే నడుముపై రాఘవేంద్రుడు ఇలాంటి కామెంట్స్ చేసాడు. వాల్మీకిలో దేవత పాట రీమిక్స్ సాంగ్ లాంఛ్‌లో పూజా హెగ్డే నడుముపై ఈయ‌న చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి. ఆ మాటలు ఆయన రేంజ్ త‌క్కువ చేసేలా ఉన్నాయంటున్నారు ఫ్యాన్స్. అందంగా ఉందంటూనే ఆమె నడుమును తాకిన బిందెను తనకు గిఫ్టుగా ఇవ్వాలని చమత్కరించాడు దర్శకేంద్రుడు. ఇది విన్న తర్వాత అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా పగలబడి నవ్వారు. హీరోయిన్ నడుముపై దర్శకేంద్రుడు చేసిన కమెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయాయి.
సమంత రాఘవేంద్రరావు (samantha raghavendra rao)
సమంత రాఘవేంద్రరావు (samantha raghavendra rao)

అప్పట్లో ఎఫ్ 2 50 డేస్ ఫంక్షన్‌కు వచ్చినపుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసాడు ఈయన. ఆ చిత్రంలో అనిల్ హీరోయిన్ల‌ను చాలా అందంగా చూపించాడ‌ని.. వాళ్లు బికినీ వేయ‌డం వ‌ల్లే సినిమా విజ‌యం సాధించిందనే అర్థం వ‌చ్చేలా మాట్లాడాడు ద‌ర్శ‌కేంద్రుడు. అది సంచ‌ల‌నంగా మారింది. సినిమా అంత పెద్ద విజ‌యం సాధిస్తే.. అది కేవ‌లం బికినీ వ‌ల్ల హిట్ అయింద‌నే అర్థం వ‌చ్చేలా మాట్లాడ‌టం దారుణ‌మే. అయితే రాఘ‌వేంద్ర రావు ఉద్దేశ్యం అది కాక‌పోయినా అనుకోకుండా స‌ర‌దా కోసం ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. ఇప్పుడు సమంత డ్రెస్‌పై చేసిన కామెంట్స్ కూడా అంతే సరదాగా ఉన్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: K. Raghavendra Rao, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు