హోమ్ /వార్తలు /సినిమా /

మరి ఆ రోజుల్లో: సౌందర్య, శ్రీదేవి కలిసిన అపురూపమైన వేళ..

మరి ఆ రోజుల్లో: సౌందర్య, శ్రీదేవి కలిసిన అపురూపమైన వేళ..

శ్రీదేవి, సౌందర్య ఫైల్ ఫోటో

శ్రీదేవి, సౌందర్య ఫైల్ ఫోటో

ఈ ఫోటో చూస్తుంటే నిజంగానే ఇదే అనిపిస్తుంది కదా. చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్లుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు.. అంతే చిన్న వయసులో దివికేగారు.

ఈ ఫోటో చూస్తుంటే నిజంగానే ఇదే అనిపిస్తుంది కదా. చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్లుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు.. అంతే చిన్న వయసులో దివికేగారు. కోట్లాది మంది హృదయాలను కన్నీటి సంద్రంలో ముంచేస్తూ అటు శ్రీదేవి.. ఇటు సౌందర్య మరణించారు. అయితే బతికున్నపుడు మాత్రం వీళ్ల సంచలనాలు అన్నీఇన్నీ కావు. ఎన్నో వందల సినిమాల్లో నటించి తమకంటూ ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్న ఈ ఇద్దరూ అప్పట్లో ఓ వేడుకలో కలిసినపుడు దిగిన అపురూపమైన ఫోటో ఇది. ఇన్నాళ్లకు సోషల్ మీడియాలో ఈ ఫోటో బాగా వైరల్ అవుతుంది.

శ్రీదేవి, సౌందర్య ఫైల్ ఫోటో

బోనీ కపూర్ బర్త్ డే సందర్భంగా బాలీవుడ్ సెలబ్రిటీస్‌తో పాటు సౌందర్య కూడా మెరిసింది. హిందీలో కూడా సూర్యవంశం లాంటి సినిమాలు చేసింది సౌందర్య. దాంతో నార్త్ ఆడియన్స్ కూడా సౌందర్యను బాగానే గుర్తు పడతారు. దానికి తోడు సౌత్ హీరోయిన్ కావడంతో శ్రీదేవితో సౌందర్యకు మంచి అనుబంధమే ఉంది. ఆ చనువుతోనే వేడుకలు కూడా చేసుకున్నారు. ఆ సందర్భంగా తీసిన అపురూపమైన ఫోటో ఇది. 2018 ఫిబ్రవరిలో దుబాయ్ పెళ్లి వేడుకలో శ్రీదేవి చనిపోగా.. 2004 ఎప్రిల్లో విమాన ప్రమాదంలో కన్నుమూసింది సౌందర్య.

First published:

Tags: Sridevi, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు