దిగ్గజ నటి తబస్సుమ్ (Tabassum passes away) ఇక లేరు. ఎన్నో చిత్రాలతో పాటు టీవీషోలు, సీరియళ్లలో నటించిన ఆమె గుండెపోటుతో మరణించారు. 78 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కార్డియక్ అరెస్ట్ వల్ల తబస్సుమ్ గురువారం ముంబైలోని ఓ ఆస్పత్రిలో మరణించినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. తబస్సుమ్‌కి నిన్న రాత్రి రెండుసార్లు గుండెపోటు వచ్చింది. రాత్రి 08:40 గంటలకు ఒకసారి, ఆ తర్వాత 08:42 గంటలకు రెండోసారి గుండె పోటు వచ్చిందని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. ఇవాళ తబస్సుమ్ అంత్యక్రియలు ముగిసినట్లు ఆమె కుమారుడు హోషాంగ్ గోవిల్ తెలిపారు.
Aditya 999: ఆదిత్య 999పై బాలకృష్ణ క్లారిటీ.. కానీ ఓ ట్విస్ట్.. ఆయన కోసం కాదట..!
తబస్సుమ్ 1944లో ముంబైలో జన్మించారు. అస్గారీ బేగం, అయోధ్య నాథ్ సచ్దేవ్ఆ మె తల్లిదండ్రులు. తబస్సుమ్ తల్లిదండ్రులు స్వాతంత్య్ర సమరయోధులు. తబస్సుమ్ పేరు వెనుక కూడా చాలా ఆసక్తికరమైన కథ కూడా ఉంది. తబస్సుమ్ తల్లి మతపరమైన భావాలను దృష్టిలో ఉంచుకుని ఆమెకు తన తండ్రి తబస్సుమ్ అని పేరు పెట్టాడు. తండ్రి మతపరమైన భావాలను దృష్టిలో ఉంచుకుని ఆమెకు తన తల్లి కిరణ్ బాలా అని పేరు పెట్టారు. పెళ్లికి ముందు ఆమె సర్టిఫికెట్లలోనూ కిరణ్ బాల సచ్దేవ్ అనే పేరే ఉండేదని సమాచారం. ఆమె భర్త పేరు విజయ్ గోవిల్. వీరి కుమారుడు పేరు హోసాంగ్ గోవిల్.
Legendary actor Tabbassum passed away at the age of 78 due to cardiac arrest at a hospital in Mumbai on 18th November. Her last rites were performed today, says her son Hoshang Govil.
(Photo source: Tabbassum's family) pic.twitter.com/KWOKcSnYXy — ANI (@ANI) November 19, 2022
తబస్సుమ్ 1947లో మేరా సుహాగ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. చిన్నతనంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పనిచేసిన తబస్సుమ్.. నటిగానే కాకుండా టాక్ షో హోస్ట్‌గా కూడా తనదైన ముద్ర వేశారు. దూరదర్శన్‌లో దేశంలోనే మొట్టమొదటి టీవీ టాక్ షో 'ఫూల్ ఖిలే హై గుల్షన్ గుల్షన్'ని హోస్ట్ చేసిన ఘనత తబస్సుమ్‌కు దక్కుతుంది. ఆమె 1972 నుంచి 1993 వరకు ఈ షోని హోస్ట్ చేసారు. ఈ షో ద్వారా ఎంతో మంది సీనియర్ నటీనటులను ఇంటర్వ్యూ చేసే అవకాశాన్ని పొందారు. ఆమె ఓ యూబ్యూట్ ఛానెల్ కూడా నడుపుతున్నారు. దాని ద్వారా ఆమె సినీ పరిశ్రమ, నటుల గురించి ఎవరికీ తెలియని కొత్త విషయాలను వివరించేవారు.
1990లో వచ్చిన స్వర్గ్ ఆమె చివరి సినిమా. జీటీవీలో 2009లో ప్రసారమైన లేడీస్ స్పెషల్ టీవీ షోలో ఆమె చివరిగా జడ్జిగా కనిపించారు. తబస్సుమ్ మృతితో బాలీవుడ్ చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood