LEGENDARY ACTOR SATHYARAJ HOSPITALIZED DUE TO COVID 19 AND HIS PRESENT HEALTH CONDITION WAS UNKNOWN PK
Sathyaraj health: సీనియర్ నటుడు సత్యరాజ్‌కు తీవ్ర అస్వస్థత.. కరోనాతో హాస్పిటల్లో చేరిన కట్టప్ప..
లెజెండరీ నటుడు సత్యరాజ్‌కు అస్వస్థత (Sathyaraj)
Sathyaraj health: సినిమా ఇండస్ట్రీని మరోసారి కరోనా కలవరపెడుతుంది. ప్రతిరోజూ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా సినీ ప్రముఖులు చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మరో సీనియర్ నటుడు (Sathyaraj health) కూడా కోవిడ్ బారిన పడ్డాడు.
సినిమా ఇండస్ట్రీని మరోసారి కరోనా కలవరపెడుతుంది. ప్రతిరోజూ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా సినీ ప్రముఖులు చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మరో సీనియర్ నటుడు కూడా కోవిడ్ బారిన పడ్డాడు. ఇప్పటికే ఇండస్ట్రీలో థర్డ్ వేవ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు, మంచు మనోజ్, మంచు లక్ష్మీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నితిన్ భార్య, హీరో విశ్వక్ సేన్‌కు కరోనా నిర్థారణ అయింది. వీళ్ళు మాత్రమే కాదు.. ఇంకా చాలా మంది కరోనా బారిన పడ్డట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా లెజండరీ నటుడు సత్యరాజ్ కూడా కరోనాతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే జనవరి 7 సాయంత్రం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేర్పించినట్లు తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆయనకు కరోనా లక్షణాలు ఎక్కువగా కనిపించినట్లు ప్రచారం జరుగుతుంది.
అందుకే వెంటనే హాస్పిటల్లో చేర్పించారు. ప్రస్తుతం సత్యరాజ్ ఆరోగ్యంపై ఎలాంటి అప్డేట్ లేదు. ఆసుపత్రి వర్గాలు కూడా ఇప్పటి వరకు సత్యరాజ్ ఆరోగ్యం గురించి ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. దాంతో అభిమానులు కంగారు పడుతున్నారు. ఈయన హెల్త్ బులిటెన్ త్వరలోనే విడుదల చేయనున్నారు. తమిళ ఇండస్ట్రీలోనూ చాలా మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పటికే కమల్, విక్రమ్, వడివేలు సహా చాలా మందికి కరోనా వచ్చింది. తాజాగా స్టార్ హీరోయిన్ త్రిషకు కూడా కరోనా వచ్చింది. తమిళనాడులో ఒమిక్రాన్‌తో పాటు కరోనా కొత్త కేసులు బయట పడుతున్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.