#ANRLivesOn: అక్కినేని నాగేశ్వ‌ర‌రావు 96వ జయంతి ప్రత్యేకం..

అక్కినేని తొమ్మది దశాబ్దాల జీవితం అందరికీ తెరిచిన పుస్తకం. జీవితంలో ఎలా ముందుకు రావాలి.. ఓ మనిషికి పట్టుదల ఎంత అవసరం అనేవి అక్కినేని జీవితం పరిశీలిస్తే అర్థమవుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 19, 2019, 11:22 PM IST
#ANRLivesOn: అక్కినేని నాగేశ్వ‌ర‌రావు 96వ జయంతి ప్రత్యేకం..
అక్కినేని(ఫేస్‌బుక్ ఫోటో)
  • Share this:
అక్కినేని తొమ్మది దశాబ్దాల జీవితం అందరికీ తెరిచిన పుస్తకం. జీవితంలో ఎలా ముందుకు రావాలి.. ఓ మనిషికి పట్టుదల ఎంత అవసరం అనేవి అక్కినేని జీవితం పరిశీలిస్తే అర్థమవుతుంది. కృషీవలుడిగా పుట్టి కృషిలో ఉన్న ఖుషీని గుర్తించి.. నిషాను ఆస్వాదించిన ఒక మధురమూర్తిగా తయారవయ్యారు అక్కినేని. ఇండస్ట్రీ అంటే అవలక్షణాలకు నిలయమని ఎప్పట్నుంచో ఓ పేరుంది. అలాంటి చోటు నుంచి వచ్చిన అక్కినేని ఏనాడూ దేనికి బానిస కాలేదు. అన్నింటికీ దూరంగా ఉన్నారు. ఓ యోగిలా జీవనం గడిపారు. సెప్టెంబర్ 20న ఆయన 96వ జయంతి.

#ANRLivesOn: Remembering the Legend.. Akkineni Nageswara Rao 5th Death Anniversary.. సీతాకోకచిలక కావడానికి పడే శ్రమ, పరిణామ అవస్థలు పడ్డారు నాగేశ్వరరావ్. అందుకే నిలబడ్డాడు. శిఖరంగా ఎదిగారు. ఇప్పుడు వచ్చిన.. ఇక రాబోయే నటులకూ ఆదర్శంగా నిలిచారు. అందుకే నాగేశ్వరరావ్ ఈజ్ ఈక్వల్ టూ కృషి.. ఈజ్ ఈక్వల్ టూ నాస్తి దుర్భిక్షం. జనవరి 22న ఆయన 5వ వర్ధంతి. akkineni nageswara rao 5th death anniversary,anr,anr lives on,anr death anniversary,anr nagarjuna,telugu cinema,తెలుగు సినిమా,అక్కినేని నాగేశ్వరరావ్,అక్కినేని,ఏఎన్నార్,అక్కినేని నాగేశ్వరరావ్ వర్ధంతి
ఏఎన్నార్


మద్యపానం, ధూమపానం లాంటి చెడు అలవాట్లకు ఏనాడూ చేరువ కాలేదు అక్కి నేని. విలాసాలు, విందులకు కూడా అక్కినేని వీలైనంత దూరంగా ఉండేవారు. ఇక 75 ఏళ్ల సినీ జీవితంలో ఏనాడూ అక్కినేనిపై ఎలాంటి పుకార్లు రాలేదు. ఒక చిన్న మచ్చ కూడా లేకుండా ఇన్నాళ్లూ ఇండస్ట్రీలో ఉన్న ఏకైక వ్యక్తి అక్కినేని మాత్రమే. ఎలాంటి అవలక్షణాల జోలికి పోలేదు కాబట్టే సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన అక్కినేని.. అందనంత ఎత్తుకు ఎదిగారు. చిన్ననాటి నుంచి చేసే పనిపైనే అక్కినేని భక్తి శ్రద్ధ. దేవుడిని అడగడమంటే అక్కినేనికి ఇష్టముండదు. మనకు కావాల్సింది మనమే సంపాదించుకోవాలని చెప్పే మనస్తత్వం అక్కినేనిది.

#ANRLivesOn: Remembering the Legend.. Akkineni Nageswara Rao 5th Death Anniversary.. సీతాకోకచిలక కావడానికి పడే శ్రమ, పరిణామ అవస్థలు పడ్డారు నాగేశ్వరరావ్. అందుకే నిలబడ్డాడు. శిఖరంగా ఎదిగారు. ఇప్పుడు వచ్చిన.. ఇక రాబోయే నటులకూ ఆదర్శంగా నిలిచారు. అందుకే నాగేశ్వరరావ్ ఈజ్ ఈక్వల్ టూ కృషి.. ఈజ్ ఈక్వల్ టూ నాస్తి దుర్భిక్షం. జనవరి 22న ఆయన 5వ వర్ధంతి. akkineni nageswara rao 5th death anniversary,anr,anr lives on,anr death anniversary,anr nagarjuna,telugu cinema,తెలుగు సినిమా,అక్కినేని నాగేశ్వరరావ్,అక్కినేని,ఏఎన్నార్,అక్కినేని నాగేశ్వరరావ్ వర్ధంతి
ఏఎన్నార్




అక్కినేని బళ్లో చదువుకోలేదు. కానీ జీవితాన్ని చదివారు. చదువు రాని అక్కినేనికి అన్నీ కళామతల్లే అయింది. విదేశాల్లో జరిగిన ఓ చిన్న అవమానంతో పట్టుబట్టి మరీ 50 ఏళ్లకు ఇంగ్లీష్ నేర్చుకున్నారు ఏఎన్నార్. ఏ పనైనా అనుకుంటే పూర్తి చేసేవరకు నిద్రపోరు ఏఎన్నార్. అందుకే ఈ చదువుకోని పట్టభద్రుడికి ఎన్నో విశ్వవిద్యాలయాలు డాక్టరేట్లు ప్రధానం చేసాయి. అక్కినేని అందుకున్న సన్మానాలకు లెక్కలేదు. భారతీయ సినీపరిశ్రమలో ఎన్ని అవార్డులున్నాయో.. అన్నీ అక్కినేని పేరు ముందుకు చేరిపోయాయి.

#ANRLivesOn: Remembering the Legend.. Akkineni Nageswara Rao 5th Death Anniversary.. సీతాకోకచిలక కావడానికి పడే శ్రమ, పరిణామ అవస్థలు పడ్డారు నాగేశ్వరరావ్. అందుకే నిలబడ్డాడు. శిఖరంగా ఎదిగారు. ఇప్పుడు వచ్చిన.. ఇక రాబోయే నటులకూ ఆదర్శంగా నిలిచారు. అందుకే నాగేశ్వరరావ్ ఈజ్ ఈక్వల్ టూ కృషి.. ఈజ్ ఈక్వల్ టూ నాస్తి దుర్భిక్షం. జనవరి 22న ఆయన 5వ వర్ధంతి. akkineni nageswara rao 5th death anniversary,anr,anr lives on,anr death anniversary,anr nagarjuna,telugu cinema,తెలుగు సినిమా,అక్కినేని నాగేశ్వరరావ్,అక్కినేని,ఏఎన్నార్,అక్కినేని నాగేశ్వరరావ్ వర్ధంతి
ఏఎన్నార్


ఇండస్ట్రీలో అతిపెద్ద గౌరవంగా భావించే దాదాసాహెబ్ ఫాల్మే అక్కినేనిని ఎప్పుడో వరించింది. ఇక కేందప్రభుత్వం కూడా అక్కినేనిని పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లతో సత్కరించింది. గొంగళిపురుగు సీతాకోకచిలక కావడానికి పడే శ్రమ, పరిణామ అవస్థలు పడ్డారు నాగేశ్వరరావ్. అందుకే నిలబడ్డాడు. శిఖరంగా ఎదిగారు. ఇప్పుడు వచ్చిన.. ఇక రాబోయే నటులకూ ఆదర్శంగా నిలిచారు. అందుకే నాగేశ్వరరావ్ ఈజ్ ఈక్వల్ టూ కృషి.. ఈజ్ ఈక్వల్ టూ నాస్తి దుర్భిక్షం.
First published: September 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...