HOME »NEWS »MOVIE »lawrence raghavendra kanchana3 first look released

‘కాంచన 3’ గుమ్మడికాయ...కొత్త లుక్‌తో అదరగొట్టిన లారెన్స్

‘కాంచన 3’ గుమ్మడికాయ...కొత్త లుక్‌తో అదరగొట్టిన లారెన్స్
ముని సిరీస్‌లో వచ్చిన మరో సినిమా ‘కాంచన 3’. లారెన్స్ స్వీయ దర్శకత్వంలో నటించి తెరకెక్కించిన ఈ చిత్రం మంచి లాభాలనే తీసుకొచ్చింది. తెలుగులో కూడా పర్లేదనిపించింది కాంచన 3.

డాన్స్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి...ఆ తర్వాత నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘మాస్’తో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న లారెన్స్.. ఆ తర్వాత తనే హీరోగా పలు చిత్రాలను డైరెక్ట్ చేసాడు. అంతేకాదు ‘కాంచన3’కి సంబంధించిన ఫస్ట్ లుక్ ఒదిలారు.

  • Share this:
    డాన్స్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి...ఆ తర్వాత నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘మాస్’తో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న లారెన్స్.. ఆ తర్వాత తనే హీరోగా పలు చిత్రాలను డైరెక్ట్ చేసాడు. అందులో ‘ముని’, ‘కాంచన’, (‘కాంచన2’)‘గంగ’ వంటి హార్రర్ సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు.

    ఈ హార్రర్ సినిమాల రూట్లోనే లారెన్స్ ‘కాంచన3’ సినిమాను తనే హీరోగా దర్శకుడిగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో లారెన్స్ సరసన వేదిక, నిక్కీ తంబోలి, ఓవియా కథానాయికలుగా నటించారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ మంగళవారం పూర్తైయింది.



    అంతేకాదు ‘కాంచన3’కి సంబంధించిన ఫస్ట్ లుక్ ఒదిలారు. మెడలో రుద్రాక్షలతో..స్లైల్‌గా కాలుపై కాలు వేసుకొని కూర్చోన్న పోస్టర్ ఆక్టుకునే విధంగా ఉంది. థమన్ సంగీతం అందిస్తున్న ‘కాంచన3’ సినిమాను ఒకేసారి తమిళంతో పాటు తెలుగులో ఏప్రిల్ 18న విడుదల చేయనున్నారు. మరి ఈ హార్రర్ సినిమాతో లారెన్స్ మరోసారి ఆడియన్స్‌ను భయపెడతాడా లేదా అనేది చూడాలి.

     
    First published:January 09, 2019, 15:06 IST