Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: July 25, 2020, 12:31 PM IST
లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi/witter)
అసలే ఇప్పుడు కరోనా టైమ్.. ఎవరేం చిన్న సమస్య చెప్పినా కూడా ముందు భయమేస్తుంది.. ఆ తర్వాత క్లారిటీ వస్తుంది. ఇప్పుడు లావణ్య త్రిపాఠి కూడా ఇలాంటి సంచలన న్యూస్ చెప్పింది. ఈ మధ్యే తనకుఎదురైన ఓ సమస్య గురించి చెప్పుకొచ్చింది లావణ్య త్రిపాఠి. అది విని అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. లాక్డౌన్ కారణంగా ఆర్నెళ్ళ పాటు హైదరాబాద్‌లోనే లాక్ అయిపోయింది లావణ్య. దాంతో తన పేరెంట్స్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది.

లావణ్య త్రిపాఠి లాక్డౌన్ ఫోటోషూట్ (lavanya tripathi/Instagram)
ఈ మధ్యే మళ్లీ అన్‌లాక్ ప్రక్రియ మొదలు కావడంతో తల్లి దండ్రుల దగ్గరికి వెళ్లింది లావణ్య. తమ సొంతూరు డెహ్రాడూన్‌కు వెళ్ళింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఫ్లైట్ ఎక్కిన తర్వాత తనకు ఎదురైన సమస్యల గురించి చెప్పుకొచ్చింది లావణ్య. అందులో మరీ ముఖ్యంగా తనకు బ్రీతింగ్ ఇష్యూ వచ్చిందని షాకింగ్ విషయం చెప్పింది ఈ ముద్దుగుమ్మ. జర్నీ సమయంలో తనతో పాటు పీపీఈ కిట్ కూడా ఉందని చెప్పింది. అది తీసుకొని వెళ్లడం కూడా ఆసక్తికరంగా అనిపించిందని చెప్పుకొచ్చింది లావణ్య త్రిపాఠి.

లావణ్య త్రిపాఠి లాక్డౌన్ ఫోటోషూట్ (lavanya tripathi/Instagram)
పీపీఈ కిట్ వేసుకున్నామని ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోవడం అడ్వాంటేజ్ అంటుంది ఈ బ్యూటీ. అయితే అంత ఎత్తున రెండున్నర గంటలు ప్రయాణం చేయడం వల్లో ఏమో కానీ తనకు గాలి కూడా సరిగ్గా ఆడలేదని చెప్పింది లావణ్య. మాస్క్ వేసుకున్నానని.. పైగా పీపీఈ కిట్ కూడా ఉండటంతో బ్రీతింగ్ సమస్యలు వచ్చినట్లు చెప్పుకొచ్చింది ఈమె. ఇంటికి వెళ్ళినా అందరితో షేక్ హ్యాండ్ ఇవ్వడం.. హగ్ చేసుకోవడం వంటివి చేయడం లేదని.. కచ్చితంగా భౌతిక దూరం పాటిస్తున్నానని తెలిపింది లావణ్య త్రిపాఠి. చాలా రోజుల తర్వాత అమ్మచేతి వంట తినడం కూడా ఆనందంగా అనిపించిందని చెప్పింది ఈమె.
Published by:
Praveen Kumar Vadla
First published:
July 25, 2020, 12:31 PM IST