ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ తన కెరీర్లోనే ఫస్ట్ టైమ్ లాయర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ముందుగా నయనతారను పేరు వినిపించింది. ఆ తర్వాత పూజా హెగ్డే పేరు లైన్లో వచ్చింది. కాదు.. కాదు.. శృతి హాసన్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ఆయన భార్య పాత్రలో నటిస్తోందనే వార్తల పుకార్లు షికార్లు చేసింది. తాజాగా పవన్ కళ్యాణ్..సరసన ఇలియాన లేదా లావణ్య త్రిపాఠి వీళ్లిద్దరిలో ఎవరిలో ఒకరు పవన్ కళ్యాణ్ సరసన కథాయికగా నటించే అవకాశాలున్నాయి. ఎక్కువగా లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో యాక్ట్ చేసే అవకాశాలున్నాయి. గతేడాది ‘అర్జున్ సురవరం’ సినిమా తర్వాత ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా నటిస్తోన్న ‘ఏ 1 ఎక్స్‌ప్రెస్’లో హీరోయిన్గా నటిస్తోంది. మొత్తంగా చూసుకుంటే.. పవన్ కళ్యాణ్ సరసన లావణ్య త్రిపాఠి నటించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయట.
కాగా 'వకీల్ సాబ్' సమ్మర్‌ను టార్గెట్ చేసుకుని మే 15న విడుదల కానున్నట్టు ప్రకటించారు. కరోనా ఎఫెక్ట్ కారణంగా ఈ సినిమా విడుదల తేది వాయిదా పడే అవకాశాలున్నాయి. ఈ చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్ కూడా మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. పవన్ కళ్యాణ్.. వకీల్ సాబ్ చిత్రంతో పాటు క్రిష్ దర్శకత్వంలో ‘విరూపాక్షి’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన అనుష్క లేదా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాకు ఓకే చెప్పాడు. వీటితో బాబీ (కే.యస్.రవీంద్ర), డాలీ (కిషోర్ పార్థసాని),వీటితో పాటు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మరో సినిమాకు సైన్ చేసినట్టు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Boney Kapoor, Dil raju, Ileana D'cruz, Lavanya Tripathi, Sriram Venu, Telugu Cinema, Tollywood, Vakeel Saab