Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: September 1, 2020, 10:45 PM IST
లావణ్య త్రిపాఠి (lavanya tripathi)
కరోనా కారణంగా షూటింగ్స్ ఏం లేకేపోవడంతో లావణ్య త్రిపాఠి ఎంచక్కా తన పర్సనల్ వీడియోలు చేసుకుంటుంది. అదిరిపోయే ఫోటోషూట్స్ కూడా చేసుకుంటూ కనులవిందు చేస్తుంది. ఇప్పుడు మరో అందమైన వీడియో కూడా చేసింది ఈ అందాల రాక్షసి. మణి రత్నం తెరకెక్కించిన బొంబాయి సినిమాను అంత ఈజీగా ఎవరూ మరిచిపోలేరు. అదిరిపోయే ప్రేమకావ్యంగా.. దానికి టెర్రరిజం జోడించి మణిరత్నం చేసిన మ్యాజిక్ ఇప్పటికీ అద్భుతమే. ఈ సినిమాలో పాటలు కూడా చార్ట్బస్టర్లే.
రెహమాన్ స్వరాలు అందర్నీ అలరించాయి. ఈ పాటలను కొందరు రీమిక్స్ చేసి చేతులు కాల్చుకున్నారు కూడా. అయితే ఇప్పుడు లావణ్య త్రిపాఠి మాత్రం సింపుల్‌గా కవర్ సాంగ్ చేసింది. కన్నానులే పాటను లావణ్య ఎంతో అందంగా కవర్ సాంగ్ చేసింది. రెహమాన్‌తో పాటు మణిరత్నంకు ట్రిబ్యూట్ అంటూ వీడియో పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. వైట్ అండ్ వైట్‌లో అమ్మడు చేసిన డాన్సులకు అభిమానులు ఫిదా అవుతున్నారు. నెటిజన్లు కూడా సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ఎ 1 ఎక్స్‌ప్రెస్‌లో నటిస్తుంది.
Published by:
Praveen Kumar Vadla
First published:
September 1, 2020, 10:45 PM IST