• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • LATHA RAJINIKANTH FACES CONTEMPT OF COURT CASE IN BENGALURU HERE ARE THE DETAILS TA

Latha Rajinikanth: రజినీకాంత్ సతీమణి లతా రజినీకాంత్ పై కోర్టు ధిక్కరణ కేసు..

Latha Rajinikanth: రజినీకాంత్ సతీమణి లతా రజినీకాంత్ పై కోర్టు ధిక్కరణ కేసు..

లతా రజినీకాంత్ (File/Photo)

Latha Rajinikanth | సూపర్ స్టార్ రజినీకాంత్ సతీమణి లతా రజినీకాంత్ పై కోర్డు ధిక్కారణ పిటిషన్ బెంగుళూరు డిస్ట్రిక్ట్ కోర్టులో దాఖలైంది.

  • Share this:
    Latha Rajinikanth | సూపర్ స్టార్ రజినీకాంత్ సతీమణి లతా రజినీకాంత్ పై కోర్డు ధిక్కారణ పిటిషన్ బెంగుళూరు డిస్ట్రిక్ట్ కోర్టులో దాఖలైంది. గతంలో దిగువ కోర్టు విచారణకు హాజరు కావాలని సుప్రీంకోర్టు లతా రజినీకాంత్‌ను  ఆదేశించినా.. ఇప్పటి వరకు బెంగుళూరు కోర్టుకు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా లతా రజినీకాంత్ హాజరు కాలేదు. దీంతో కోర్టు పలు మార్లు లతా రజినీకాంత్‌కు సమన్లు జారీ చేసినా.. ఇప్పటి వరకు రెస్పాన్స్ రాలేదు.  దీంతో కోర్డు ధిక్కారణ కింద లతా రజినీకాంత్ పై పిటిషన్ దాఖలైంది. కొచ్చాడయాన్ నిర్మాతలపై యాడ్ బ్యూరో దాఖలు చేసిన జ్యూడిషియల్ విచారణ వచ్చే నెల 2న విచారణకు రానుంది.

    Latha Rajinikanth faces contempt of court case in bengaluru here are the details,Latha Rajinikanth,Rajinikanth,Latha Rajinikanth  faces contempt of court,Latha Rajinikanth faces contempt of court case in bengaluru,latha rajinikanth,kollywood,లతా రజినీకాంత్,లతా రజినీకాంత్ కేసు నమోదు,
    రజినీకాంత్, లత (ఫైల్ ఫొటోలు)


    లతా రజనీకాంత్ పై మొదట అడిషనల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో తొలి కేసు దాఖలైంది. ఆ తర్వాత 2014లో  ఉల్సూర్ గేట్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కొచ్చాడయాన్ నిర్మాతలైన లతా రజినీకాంత్ పై రూ. 6.2 కోట్లు బాకీ రావలసి ఉందని యాడ్ బ్యూరో కేసు నమోదు చేసింది. అప్పట్లో పోస్ట్ ప్రొడక్షన్‌ కోసం ఈ సంస్థ పనిచేసింది. అప్పట్లో ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్‌కు  రూ. 10 కోట్లు ఖర్చు అయిందని తెలిపారు. అందులో రూ. 6.2 కోట్లు కొచ్చాడయాన్ నిర్మాతలు బాకీ ఉన్నారని యాడ్ బ్యూరో తెలిపింది. అప్పట్లో లతా రజినీకాంత్ తమకు ఈ నగదుపై వ్యక్తిగత హామి ఇచ్చారు. ఆ తర్వాత లతా గారు  ఈ సంగతే మర్చిపోయారు. దీంతో ఈ డబ్బు విషయమై తాము కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని యాడ్ బ్యూరో సంస్థ తెలియజేసింది. ఈ నేపథ్యంలో లతా రజినీకాంత్‌ను నవంబర్ 2న వ్యక్తిగతంగా హాజరు కావాలని బెంగుళూరు జిల్లా  కోర్టు తెలిపింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు