లతా మంగేష్కర్ ఆరోగ్యంపై కీలక అప్‌డేట్..

Latha Mangeshkar health updates : లతా అనారోగ్యానికి గురయ్యారని తెలిసి దేశవ్యాప్తంగా ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. లతా త్వరగా కోలుకోవాలని అభిమానులు, పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆకాంక్షించారు.

news18-telugu
Updated: November 13, 2019, 10:45 AM IST
లతా మంగేష్కర్ ఆరోగ్యంపై కీలక అప్‌డేట్..
లతా మంగేష్కర్ (ఫైల్ ఫోటో)
  • Share this:
సుప్రసిద్ద గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యం ఇప్పటికీ విషమంగానే ఉన్నట్టు సమాచారం.న్యుమోనియాతో బాధపడుతున్న ఆమెకు బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. డా.పతీత్ సంధానీ నేత్రుత్వంలోని వైద్యుల బృందం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. న్యుమోనియాతో పాటు గుండె సంబంధిత సమస్యలు, ఛాతీ ఇన్‌ఫెక్షన్ కారణంగా లతా ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. ఇన్‌ఫెక్షన్ అదుపులోకి వస్తేనే వైద్య ప్రక్రియ ముందుకు
సాగుతుందని.. దాన్ని నియంత్రించేందుకు యాంటీ బయాటిక్స్ ఇస్తున్నామని వైద్యులు తెలిపారు.

లతా అనారోగ్యానికి గురయ్యారని తెలిసి దేశవ్యాప్తంగా ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. లతా త్వరగా కోలుకోవాలని అభిమానులు, పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆకాంక్షించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆమె ఆరోగ్యంపై అప్పుడే ఏమీ చెప్పలేమని.. ఆమె శరీరం చికిత్సకు సహకరించాలని కోరుకుంటున్నామని వైద్యులు వెల్లడించారు. మరో వారం రోజుల పాటు ఆమె ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుందని చెప్పారు.

.

First published: November 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>