Bhavadeeyudu Bhagat Singh: ఇక ఆ సస్పెన్స్ వీడినట్లే! మెగా ఫ్యాన్స్ కోసం ఇదీ హరీష్ శంకర్ స్కెచ్
Photo Twitter
Pawan Kalyan: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ అయిన నేపథ్యంలో ఆయన సినిమాల షెడ్యూల్స్ కోసం ఇచ్చిన డేట్స్ డిస్టర్బ్ అయ్యాయనే సమాచారాలు వైరల్ అయ్యాయి. ఆ కారణంగానే ఆయన లేటెస్ట్ మూవీ భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో షూటింగ్ రద్దయిందని అన్నారు.
ఓ వైపు రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూనే తన సినీ కెరీర్లో దూసుకుపోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). వకీల్ సాబ్ సినిమాతో రీ- ఎంట్రీ ఇచ్చిన ఆయన ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. తాను కమిటైన అన్ని సినిమాల షూటింగ్స్ చకచకా కంప్లీట్ చేస్తున్నారు. కాగా గత కొన్నిరోజులుగా రాజకీయాలపై ఎక్కువ ఫోకస్ పెట్టిన ఆయన.. వీలైనంత వరకు ఆంధ్రప్రదేశ్ రైతులక అండగా నిలుస్తూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సినిమాల షెడ్యూల్స్ కోసం ఇచ్చిన డేట్స్ డిస్టర్బ్ అయ్యాయనే సమాచారాలు వైరల్ అయ్యాయి. ఆ కారణంగానే ఆయన లేటెస్ట్ మూవీ భవదీయుడు భగత్ సింగ్ (Bhavadeeyudu Bhagat Singh)సినిమాలో షూటింగ్ రద్దయిందని అన్నారు.
టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఈ భవదీయుడు భగత్ సింగ్ సినిమా రూపొందుతోంది. అయితే పవన్ డేట్స్ అందుబాటులో లేక ఈ సినిమా కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉన్నట్లుగా అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. ఇటీవల ఈ సినిమా షూటింగ్ కాస్త గ్యాప్ ఎక్కువ రావడంతో మళ్లీ కొన్ని వార్తలు రావడం, అభిమానుల్లో కన్ఫ్యూజన్ నెలకొనడం లాంటివి జరిగాయి.
దీంతో నేరుగా డైరెక్టర్ హరీష్ శంకర్ రంగంలోకి దిగారని తెలుస్తోంది. ఫైనల్‌గా దర్శకుడు హరీష్ శంకర్ సహా ఈ సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు పవన్ కళ్యాణ్‌ను ప్రత్యేకంగా కలవడానికి రెడీ అయినట్లు ఇన్ సైడ్ టాక్. పవన్ కళ్యాణ్‌తో అన్ని విషయాలు మాట్లాడి ఆ తర్వాత క్లియర్ అప్డేట్ ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ మేరకు ఈ రెండుమూడు రోజుల్లోనే పవన్‌తో స్పెషల్ మీట్ ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తోంది.
ఇకపోతే తమిళ సూపర్ హిట్ మూవీ ‘వినోదయ సీతం’ (Vinodaya sittam) సినిమా తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారనే సమాచారం వైరల్ అవుతోంది. ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్క్రీన్ షేర్ చేసుకుంటారని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. రీ- ఎంట్రీ ఇచ్చిన వెంటనే వరుసగా బిగ్గెస్ట్ ప్రాజెక్టులను లైన్లో పెట్టిన పవన్ కళ్యాణ్.. ఈ సినిమా కోసం కొన్ని డేట్స్ ఇచ్చారని లేటెస్ట్ టాక్. పవన్ బిజీగా ఉన్న నేపథ్యంలో సరిగ్గా ఆ డేట్స్ వాడేయాలని ఈ మూవీ దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట.
Published by:Sunil Boddula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.