హోమ్ /వార్తలు /సినిమా /

Ntr 30: ఎన్టీఆర్ 30 సినిమా రిలీజ్ డేట్‌పై .. లేటెస్ట్ అప్ డేట్..

Ntr 30: ఎన్టీఆర్ 30 సినిమా రిలీజ్ డేట్‌పై .. లేటెస్ట్ అప్ డేట్..

NTR Photo : Twitter

NTR Photo : Twitter

ఎన్టీఆర్ 30 సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్ల లేదు. మరో రెండు నెలల్లో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈలోపే.. సినిమా రిలీజ్ డైట్ పై ఇంట్రస్టింగ్ టాక్ నడుస్తోంది.

RRR సక్సెస్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) సినిమాలు చేస్తున్నారు. కొరటాల శివ డైరెక్షణ్‌లో ఎన్టీఆర్ 30 వస్తున్న సినిమా వస్తున్న విషయం తెలిసిందే. తన కెరీర్ లో 30వ సినిమాగా దర్శకుడు కొరటాల శివతో(Koratala Siva) ఒక బిగ్గెస్ట్ మాస్ ప్రాజెక్ట్ ని చేయబోతున్నాడు. మరి దీని నుంచి ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా వచ్చిన ఒక మాస్ మోషన్ పోస్టర్ గ్లింప్స్ అందర్నీ ఆకట్టుకుంది. ఎన్టీఆర్ అభిమానుల్లో ఈ సినిమాపై  ఓ రేంజ్ లో హైప్ ని ఇచ్చింది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని  నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా ప్యాన్ ఇండియా(Pan India Movie) స్థాయిలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మేకర్స్ అనుకుంటున్నా రిలీజ్ డేట్ పై తాజాగా ఓ టాక్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఎన్టీఆర్ 30 సినిమాను ప్రపంచ వ్యాప్తంగా మే 19న రిలీజ్  చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ఇంకా దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి   క్లారిటీ రాలేదు. ప్రస్తుతం అయితే ఈ సినిమా ఇంకా స్టార్ట్ అవ్వాల్సి ఉండగా ఆ స్టార్టింగ్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

మరోవైపు ఎన్టీఆర్ 30  సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందోనని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ సినిమా అంత త్వరగా సెట్స్ పైకి వెళ్లకపోవచ్చని అంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ కథల పట్ల, సన్ని వేశాల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ నేపథ్యంలోనే పక్కాగా అన్ని కుదిరాకే సెట్స్ పైకి వెళ్లాలనీ భావిస్తోందట టీమ్. ఈ క్రమంలో ఈ సినిమా ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరోవైపు ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటిస్తున్నహీరోయిన్ విషయంలో కూడా ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.  ముందుగా ఆలియా భట్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు. అయితే ఆమె వివాహం, ఇతర సినిమాలతో బిజీగా మారడంతో ఆమె ప్లేస్‌లో రష్మిక మందన్న (Rashmika Mandanna) పరిశీలిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు (Anirudh Ravichander) అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారు.

First published:

Tags: Jr ntr, Koratala siva, NTR 30

ఉత్తమ కథలు