హోమ్ /వార్తలు /సినిమా /

నటుడు శివాజీ రాజా ఆరోగ్యంపై కీలకమైన అప్‌డేట్..

నటుడు శివాజీ రాజా ఆరోగ్యంపై కీలకమైన అప్‌డేట్..

అయితే, గ్రేటర్ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి నటుడు, నిర్మాత, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా 300 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు. గుంటూరులో షూటింగ్ జరుగుతుంటే, దాన్ని ఆపేసి తాను ఓటు వేయడానికి వచ్చినట్టు తెలిపారు. (actor shivaji raja)

Shivaji Raja: టాలీవుడ్ నటుడు శివాజీ రాజాకు ఉన్నట్లుండి గుండెపోటు రావడంతో వెంటనే అతన్ని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. ఇది జరిగి కూడా మూడు రోజులు అవుతుంది. అయితే బిపి డౌన్..

టాలీవుడ్ నటుడు శివాజీ రాజాకు ఉన్నట్లుండి గుండెపోటు రావడంతో వెంటనే అతన్ని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. ఇది జరిగి కూడా మూడు రోజులు అవుతుంది. అయితే బిపి డౌన్ కావడంతోనే అలా సడన్ స్ట్రోక్ వచ్చిందని.. ప్రస్తుతం ఈయన ఆరోగ్యం కుదుటపడిందని తెలుస్తుంది. తగిన సమయంలో వైద్యులు సరైన చికిత్స అందించి.. హార్ట్‌లో స్టెంట్ వేశారు. ప్రస్తుతం శివాజీ రాజా కోలుకొంటున్నాడు. ఇండస్ట్రీలో ఉన్న కొందరు స్నేహితులు ఆయన్ని ఫోన్‌లో పరామర్శించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుసుకుని ఆనందించారు. అలాగే కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత శివాజీ రాజాను డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు.

నటుడు శివాజీ రాజా (actor shivaji raja)
నటుడు శివాజీ రాజా (actor shivaji raja)

టాలీవుడ్ పెద్దలు శివాజీ రాజా ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుంటున్నారు. గతేడాది మా అసోసియేషన్ ఎన్నికలల్లో ఓటమి తర్వాత ఈయన పెద్దగా బయటికి రావడం లేదు. ఈ మధ్యే కరోనా నేపథ్యంలో ఆయన తన ఫామ్ హౌస్‌లో పండించిన కూరగాయలను సినీ కార్మికులకు పంచి అండగా నిలబడ్డాడు శివాజీ రాజా. అంతలోనే ఆయనకు హార్ట్ ఎటాక్ రావడం ఆయన శ్రేయోభిలాషులను కంగారు పెట్టింది. అయితే ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Shivaji Raja, Telugu Cinema, Tollywood