LATEST ITEM SONGS AND REMUNERATIONS FOR HEROINES IN TOLLYWOOD MHN
Heroines - Item song Remunerations: ఐటెమ్ సాంగ్స్ కోసం ఇక స్టార్ హీరోయిన్స్ అవసరం లేదు.. లేటెస్ట్ ఐటెమ్ బాంబుల రెమ్యునరేషన్స్ చూసేద్దాం...
Latest Item songs and remunerations for heroines in Tollywood
Heroines - Item song Remunerations: ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ అంటే, జయమాలినో, జ్యోతిలక్ష్మినో, సిల్క్ స్మితనో ఉండేవారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది.
ఇకపై దర్శకులు, నిర్మాతలు ఓ విషయంలో టెన్షన్ పడక్కర్లేదని జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే అనిపిస్తుంది. ఇంతకీ ఏ విషయంలో దర్శకులు, నిర్మాతలు టెన్షన్ పడనక్కర్లేదో తెలుసా.. స్పెషల్ సాంగ్, ఐటెమ్‌సాంగ్స్ విషయంలో. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ అంటే, జయమాలినో, జ్యోతిలక్ష్మినో, సిల్క్ స్మితనో ఉండేవారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. స్టార్ హీరోయిన్స్ చాలా మంది ఐటెమ్ సాంగ్స్‌లో కాలు కదపడానికి రెడీ అవడమే కాదు.. తమ అంద చందాలను ఐటెమ్ సాంగ్స్‌లో ఆరబోసి కుర్రకారుని, ప్రేక్షకాభిమానులను ఆకట్టుకున్నారు. ఈ ట్రెండ్‌ను మనం బాలీవుడ్ నుంచి అడాప్ట్ చేసుకున్నాం. తమన్నా, శ్రుతిహాసన్, పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ హీరోయిన్స్ ఓ సాంగ్‌లో గ్లామర్‌ను ఒలకబోశారు. మన సౌత్ హీరోయిన్సే కాదండోయ్ పరభాషకు చెందిన స్టార్ హీరోయిన్స్ సైతం టాలీవుడ్లో సొగసులను చూపించి అందుకు ప్రతిఫలంగా భారీ పారితోషకాలను సొంతం చేసుకున్నవారే.
ట్రెండ్‌ను ఫాలో అవుతూ మన దర్శక నిర్మాతలు అగ్ర కథానాయకిలతో ఐటెమ్ సాంగ్స్‌ను చేయించారు. వారు డిమాండ్ చేసినంత ఇచ్చారు కూడా. అయితే ఇప్పుడు రూట్ మారుస్తున్నారు మన మేకర్స్. సోషల్ మీడియా ద్వారా, బుల్లితెర ద్వారా క్రేజ్‌ను సంపాదించుకున్న తారలను, ఫేమ్ తగ్గి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారిని ఐటెమ్ సాంగ్స్‌లో నటింప చేయిస్తున్నారు. స్టార్ హీరోయిన్స్‌కు ఇచ్చే రెమ్యునరేషన్లో సగం కంటే తక్కువ ఇచ్చినా చాలు.. వాళ్ల కంటే అందాలను ఆరబోయడంలో ఏ మాత్రం వెనకాడటం లేదు. అసలు ఈ లిస్టులో ఎంత మంది కుర్రభామలు చేరారో చూద్దాం..
హెబ్బా పటేల్:
ఈ లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సింది. హెబ్బా పటేల్. ఒకప్పుడు హీరోయిన్గా మంచి క్రేజును దక్కించుకున్న హెబ్బా పటేల్ తర్వాత అనుకున్న రేంజులో సక్సెస్‌లను అందుకోలేకపోయింది. దీంతో ఈ అమ్మడుకి రెడ్ సినిమాలో ఐటెమ్ సాంగ్ అవకాశం వచ్చింది. ఈ సాంగ్‌లో నాలుగైదు రోజులు నటించడానికి హెబ్బా పటేల్‌కు దాదాపు పదిహేను లక్షల రూపాయల రెమ్యునరేషన్ దక్కింది.
Latest Item songs and remunerations for heroines in Tollywood
మోనాల్ గజ్జర్:
ఐదారు చిన్న సినిమాల్లో నటించిన గుజరాతీ ముద్దుగుమ్మ మోనాల్ గజ్జర్‌కు బిగ్‌బాస్ 4 తిరుగులేని క్రేజ్‌ను కట్టబెట్టింది. ఈ క్రేజుతో పలు సినిమాల్లో, సీరియల్స్‌తో మోనాల్ గజ్జర్ బిజీగా మారింది. ఆ సమయంలో అల్లుడు అదుర్స్ సినిమాలో ఐటెమ్ సాంగ్ చేసే అవకాశం దక్కింది మోనాల్ గజ్జర్‌కు ఈ ఐటెమ్ సాంగ్ చేయడానికి మోనాల్ ఏకంగా పదమూడు లక్షల రూపాయల రెమ్యునరేషన్‌ను వసూలు చేసింది.
Latest Item songs and remunerations for heroines in Tollywood
అప్సరా రాణి:
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ వెలుగులోకి తీసుకొచ్చిన ఒడిస్సా అమ్మడు అప్సరా రాణి..ఈమె రెండు, మూడు సినిమాల్లో నటించినప్పటికీ అనుకున్నంత పేరు రాలేదు. ఆ సమయంలో రవితేజ క్రాక్ సినిమాలో భూం బద్దల్.. ఐటెం సాంగ్ చేసే అవకాశం దక్కింది. ఈ సాంగ్‌లో నటించి అప్సరా రాణి క్రేజ్‌తో పాటు తొమ్మిది లక్షల రూపాయల రెమ్యునరేషన్‌ను అందుకుంది. ఫ్యూచర్లోనూ ఈ అమ్మడుకి మరిన్ని ఐటెమ్ సాంగ్స్ అవకాశాలు రావచ్చునని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి.
Latest Item songs and remunerations for heroines in Tollywood
అనసూయ:
బుల్లితెరపై హాట్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్.. క్షణం, రంగస్థలం వంటి సినిమాల్లో నటిగా తనదైన గుర్తింపు దక్కించుకుంది. సోగ్గాడే చిన్ని నాయనాలో ఓ చిన్న పాత్ర, సాంగ్‌లో నటించిన అనసూయ, విన్నర్ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నటించింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మరో స్పెషల్ సాంగ్ చేయడానికి ఓకే చెప్పిందని టాక్. చావు కబురు చల్లగా సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్ చేయడానికి అనసూయ ఇరవై లక్షల రూపాయలను వసూలు చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.
Latest Item songs and remunerations for heroines in Tollywood
స్టార్ హీరోయిన్స్‌ను ఐటెమ్ సాంగ్స్‌ను నటించమని అడిగితే వారికి తక్కువలో తక్కువగా యాబై లక్షల రూపాయల రెమ్యునరేషన్‌ను ఇవ్వాల్సి వస్తుంది. అదే హీరోయిన్స్‌గా అవకాశాలు లేక వెనక్కి మళ్లాలనుకుంటున్న హీరోయిన్స్, సోషల్ మీడియా, బుల్లితెరపై క్రేజ్ దక్కించుకున్న అమ్మడులకు ఐటెమ్ సాంగ్స్‌లో అవకాశం ఇస్తే.. బెటర్ అని నిర్మాతలు ఆలోచించడమే ఇందుకు కారణమని వారు భావిస్తున్నారు.
Published by:Anil
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.