Home /News /movies /

LATEST BUZZ BANDLA GANESH SHARED HIS SON HITHESH PHOTO SLB

కొడుకు ఫొటోతో కాకరేపిన బండ్ల గణేష్.. ఇదీ బండ్లన్న టైమింగ్ అంటే!!

Photo Twitter

Photo Twitter

Bandla Ganesh Son: పవన్ కళ్యాణ్ భక్తుడిగా యమ ఫేమస్ అయిన బండ్లన్న సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ రోల్ పోషిస్తుంటారు. ఎప్పటికప్పుడు తన సినిమా సంగతులతో పాటు సమాజం పోకడపై కామెంట్స్ చేసే ఆయన.. తాజాగా తన కొడుకు ఫొటోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసి కాక రేపారు.

ఇంకా చదవండి ...
నటుడిగా (Actor) కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత నిర్మాతగా (Producer) ఎదిగి తెలుగు తెరపై తన మార్క్ చూపించారు బండ్ల గణేష్ (Bandla Ganesh). రాజకీయాల్లోకి (Politics) కూడా వెళ్లి అక్కడ పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో తిరిగి కెమెరా ముందుకొచ్చారు. కామెడీ రోల్స్ చేస్తూనే హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వ్యాపారవేత్తగా, చిత్ర పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భక్తుడిగా యమ ఫేమస్ అయిన బండ్లన్న సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ రోల్ పోషిస్తుంటారు. ఎప్పటికప్పుడు తన సినిమా సంగతులతో పాటు సమాజం పోకడపై కామెంట్స్ చేసే ఆయన.. తాజాగా తన కొడుకు ఫొటోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసి కాక రేపారు. బండ్లన్న కొడుకును (Bandla Ganesh Son ) చూసిన నెటిజన్లు కామెంట్ల మోత మోగిస్తున్నారు. దీంతో ఈ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది.

సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది కామన్. పలువురు దర్శక నిర్మాతలు, స్టార్ హీరోలు వారి వారి కొడుకులను హీరోలుగా చూడాలని ఎన్నో కలలు కంటుంటారు. బండ్ల గణేష్‌కి ఆ కోరిక ఉంది. తన ఇద్దరు కొడుకుల్లో ఒకరికి వ్యాపారవేత్తగా సెట్ చేసి తన బిజినెస్ అప్పగిస్తానని, ఇంకొకరిని మాత్రం సినీ ఇండస్ట్రీలో సెట్ చేస్తానని గతంలో ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు బండ్ల గణేష్. ఈ మేరకు తన కొడుకు ఫొటోను ట్విట్టర్ వేదికగా అందరి ముందు పెట్టారు. ఈ పిక్ చూసి హీరో పర్సనాలిటీ, సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.


దీంతో ఒక్కసారిగా బండ్ల గణేష్ నట వారసుడు రాబోతున్నట్లు టాక్ మొదలయింది. స్పెషల్ ఫొటో షేర్ చేయడంతో బజ్ క్రియేట్ అయ్యింది. ఈ హీరో అచ్చం నీ లానే ఉన్నాడు అన్నా, ఇది హీరో మెటీరియల్.. రెక్ట్ టైం చూసి మంచి స్క్రిప్ట్ తో దించు డెబ్యూతో కొట్టు గట్టిగా అంటూ కామెంట్లు చేస్తున్నారు బండ్లన్న ఫాలోవర్స్. మరోవైపు బండ్ల గణేష్ ఆరాధ్య దైవమైన పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ సినీ ఎంట్రీపై చర్చలు నడుస్తున్న ఈ పరిస్థితుల్లో ఇప్పుడు బండ్ల గణేష్ కొడుకు హితేష్ నగన్ ఫొటోను పంచుకోవడం ఆన్ లైన్ మాధ్యమాల్లో హాట్ టాపిక్ అయింది.

దీంతో ఇదీ బండ్లన్న టైమింగ్ అంటే! అనేవారు కూడా ఉన్నారు. ఏదేమైనా తన కొడుకు విషయంలో బండ్ల గణేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో, ఎప్పుడు సినీ ఇండస్ట్రీకి తీసుకొస్తారో ఆయన నోరు విప్పితే గాని చెప్పలేం.
Published by:Sunil Boddula
First published:

Tags: Bandla Ganesh, Producer bandla ganesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు