LATE SRIDEVI DAUGHTER JANHVI KAPOOR ALL SET TO ENTRY INTO TOLLYWOOD LAUNCHED BY KRISHNA VAMSI PK
Janhvi Kapoor: టాలీవుడ్‌కు జాన్వీ కపూర్.. దర్శకుడు ఎవరో తెలుసా..?
జాన్వీ కపూర్ File/Photo
Janhvi Kapoor: శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీకి వస్తుందని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. ఎన్నో ఏళ్లుగా ఈమెను టాలీవుడ్ వైపు అడుగులు వేయించాలని చూస్తున్నారు దర్శకులు. అందులో రాజమౌళి కూడా ఉన్నాడు.
శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీకి వస్తుందని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. ఎన్నో ఏళ్లుగా ఈమెను టాలీవుడ్ వైపు అడుగులు వేయించాలని చూస్తున్నారు దర్శకులు. అందులో రాజమౌళి కూడా ఉన్నాడు. కానీ ఇది ఇప్పటి వరకు జరగలేదు. శ్రీదేవి కూతురు కావడంతో ఇక్కడ కూడా జాన్వీకి మంచి క్రేజ్ ఉంది. అప్పట్లో విజయ్ దేవరకొండ సినిమాలో జాన్వీ హీరోయిన్గా ఖరారు అయిందనే వార్తలొచ్చాయి. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇదిలా ఉంటే ఇన్నాళ్లకు ఈమె తెలుగులో ఎంట్రీ ఇవ్వనుందనే ప్రచారం జరుగుతుంది. విలక్షణ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఈయన సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవీ సినిమాల్లో టెక్నికల్ టీంతో పాటు నటీనటులు కూడా స్క్రీన్ అంతా కనిపిస్తుంటారు. అంతేకాదు కథలో వైవిధ్యం కూడా ఉంటుంది. మరీ ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ కథలు కూడా బాగానే రాస్తుంటాడు ఈ దర్శకుడు. ఇప్పుడు ఇలాంటి ఓ పవర్ పుల్ కథను కృష్ణవంశీ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఆ సినిమాను జాన్వీ కపూర్‌తో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు క్రియేటివ్ డైరెక్టర్. లాక్ డౌన్ సమయంలో ఈ కథను సిద్ధం చేసుకున్నాడని తెలుస్తుంది.
జాన్వీ కపూర్ కృష్ణవంశీ (Janhvi kapoor krishna vamsi)
ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా బోనీ కపూర్‌కు వినిపించి ఓకే చేయించాడని తెలుస్తుంది. అక్కడ్నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందని వార్తలొస్తున్నాయి. గతేడాది జాన్వీ నటించిన ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ సినిమా చూసిన తర్వాత తన కథకు జాన్వీ అయితేనే సరిపోతుందని భావించి అటు వైపు అడుగులు వేసాడు జాన్వీ కపూర్. అయితే బోనీ కపూర్‌తో కూడా కృష్ణవంశీకి మంచి పరిచయం ఉంది.
జాన్వీ కపూర్ గుంజన్ సక్సేనా
ఈయన నిర్మాతగా హిందీలో కృష్ణవంశీ దర్శకత్వంలో ‘శక్తి: ది పవర్’ చిత్రం రూపొందించారు. ఇది అంత:పురం సినిమాకు రీమేక్. ప్రస్తుతం ఆయన ‘రంగమార్తాండ’ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోవైపు జాన్వీ కపూర్ ‘గుడ్ లక్ జెర్రీ’, ‘రూహి’, ‘దోస్తానా2’ సినిమాలతో బిజీగా ఉంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.