Home /News /movies /

LATE SENIOR NTR DRIVER LAXMAN INTERESTING COMMENTS ON NTR WIFE LAKSHMI PARWATHI AND HIS FAMILY TA

ఎన్టీఆర్ రావణుడు.. లక్ష్మీ పార్వతి సీత.. అన్నగారి డ్రైవర్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు..

ఎన్టీఆర్ డ్రైవర్ లక్ష్మణ్,

ఎన్టీఆర్ డ్రైవర్ లక్ష్మణ్,

    అవును..ఎన్టీఆర్ రావణుడు..లక్ష్మీ పార్వతి సీతను అంది ఎవరో కాదు..అన్నగారి దగ్గర ఎన్నో ఏళ్ల పాటు డ్రైవర్‌గా సేవలు చేసిన లక్ష్మణ్..ఒక యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..ముందుగా లక్ష్మీ పార్వతి అన్నగారి జీవితాన్ని రాయడానికి రాలేదు. టీవీలో అవకాశం వచ్చి..ఎన్టీఆర్‌ను నిలువునా ముంచిందని తన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. రావణుడు సీతను లంకలో పెట్టుకొని సర్వనాశనం అయ్యాడు. మీరు లక్ష్మీ పార్వతిని ఇంట్లో పెట్టుకొని మీ పేరు పోగుట్టుకున్నరని నేను ఎన్టీఆర్‌తో చెప్పానన్నారు. అదే సయమంలో ఎన్టీఆర్ వెన్నుపోటు నేపథ్యంలో తెరకెక్కిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాపై తనదైన శైలిలో స్పందించారు. సినిమాలో చూపించనట్టు లక్ష్మీ పార్వతి అంత మంచి కాదన్నారు.

    ఇక ఎన్టీఆర్‌ను గద్దె దింపి బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత..ఎన్టీఆర్ ఓసారి నన్ను బాబు పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారని అడిగారు. దానికి సమాధానంగా రాజకీయ చాణక్యుడు బాగానే చేస్తున్నారని చెప్పుకొచ్చనన్నారు లక్ష్మణ్.మరోవైపు నేను ఎన్టీఆర్‌తో మనవైపు కూడా కొంచెం తప్పుందని అన్నగారితో అన్నాను. అపుడు ఆయన నా వైపు అదోలా చూసారన్నారు. రావణుడు సీతను లంకలో పెట్టుకొని ఎలా నాశమయ్యారో.. మీరు అలా అధికారాన్ని పోగుట్టుకున్నారు అని చెప్పాను. అపుడు ఎన్టీఆర్ స్పందిస్తూ..మీకేం ఎంతైనా అంటారని నా వైపు అదోలా చూసారు. లక్ష్మీ పార్వతి కారణంగా ఎన్టీఆర్ అధికారం, ప్రతిష్ట, కుటుంబ సభ్యులు దూరం కావడం వల్లే అలా అన్నానన్నారు.

    మరోవైపు హరికథలు చెప్పుకునే లక్ష్మీ పార్వతి భర్త వీర గ్రంథం సుబ్బారావు టీవీలో అవకాశం గురించి ఎన్టీఆర్ ‌ను కలిశారు. ఎన్టీఆర్ కూడా సానుకూలంగానే స్పందించి ఆమె భర్తకు దూరదర్శన్‌లో అవకాశం ఇప్పించారు.  అప్పుడు ఆమెకు ఒక కొడుకు కూడా వున్నాడు.ఆ తరువాత ఎన్టీఆర్ తో లక్ష్మీ పార్వతితో పరిచయాలు పెరిగాయి. ఆ తర్వాత వాళ్లిద్దరు పెళ్లిచేసుకున్నారు. జనాలు కూడా ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి అంత పాజిటివ్‌గా రియాక్ట్ కాలేదు. అంతేకాదు ఎన్టీఆర్ జీవితంలో ప్రవేశించి ఆయన్ని నాశనం చేసిన లక్ష్మీ పార్వతి గురించి మాట్లాడటం వేస్ట్ అన్నాడు. ఇక ఎన్టీఆర్ కి మొదటినుంచి దూరంగా వున్న కుటంబ సభ్యులు అప్పుడప్పుడు వస్తుండేవారు కానీ ఆమె రాకతో పూర్తిగా రావడం మానేశారు అని చెప్పుకొచ్చారు లక్ష్మణ్.

    బసవతారకం గారి బంగారు ఆభరణాలు వారి కొడుకు రామకృష్ణ గారి ఇంట్లో అబిడ్స్ లో ఉండేవని ఒకసారి ఎన్టీఆర్ ఆ ఆభరణాల గురించి వారిఇంటికి కారులో వెళ్ళినపుడు రామకృష్ణ ఇంట్లోలేరు అప్పుడు ఎన్టీఆర్ డ్రైవర్ గా వున్న తనను పిలిచి కాపలాదారుణ్ని పిలుచుకు రమన్నారు, నేను అక్కడ వున్న కాపలావాళ్లను తీసుకురాగా.. ఎన్టీఆర్ వాళ్ళతో నగలున్న గది తాళం తీయించి నగలతో బయలుదేరి లక్ష్మి పార్వతికి ఇచ్చారన్నారు.  తరువాత ఈ విషయం తెలిసి తనను రామకృష్ణ విచారించగా ప్రభుత్వ డ్రైవర్ ని యజమాని చెప్పిన్నటు చెయ్యాలి అని సమాధానం ఇచ్చానన్నారు. ఆ తరువాత ఆ నగల గురించి పెద్ద గొడవలే జరిగాయన్నారు. ఈ రకంగా ఎన్టీఆర్ కుటుంబం తో తన అనుభవాలను పంచుకున్నాడు లక్ష్మణ్.
    First published:

    Tags: Andhra Pradesh Assembly Election 2019, AP Politics, Chandrababu naidu, Jr ntr, Lakshmi Parvathi, Lakshmis NTR, Lok Sabha Elections 2019, NTR, NTR Biopic, Tollywood

    తదుపరి వార్తలు