Soundarya: సౌందర్య జయంతి.. నేటి తరానికి సావిత్రమ్మ..

సౌందర్య జయంతి (soundarya birth anniversary)

Soundarya: సౌందర్య.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అభినవ సావిత్రి అనే బిరుదు సొంతం చేసుకున్న మహానటి ఈమె. ఈ తరం ప్రేక్షకులకు సావిత్రి అంటే ఎలా..

  • Share this:
సౌందర్య.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అభినవ సావిత్రి అనే బిరుదు సొంతం చేసుకున్న మహానటి ఈమె. ఈ తరం ప్రేక్షకులకు సావిత్రి అంటే ఎలా ఉంటుందో సినిమాల్లో మాత్రమే చూసారు. కానీ నటన పరంగా చూసుకుంటే ఆ సావిత్రి అచ్చంగా ఇలాగే ఉండేదేమో అనేంతగా సౌందర్య అందర్నీ మాయ చేసారు. కానీ దురదృష్టవశాత్తు కేవలం 31 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసింది ఈమె. జులై 18న ఈమె జయంతి. మరణించి 16 ఏళ్లవుతున్నా కూడా ఇప్పటికీ ఈమెను మరిచిపోలేకపోతున్నారు ఫ్యాన్స్.

సౌందర్య 16వ వర్ధంతి (soundarya death anniversary)
సౌందర్య జయంతి (soundarya birth anniversary)


చనిపోయేనాటికి సౌందర్య వయసు కేవలం 31 సంవత్సరాలు మాత్రమే.. పైగా పెళ్లై ఏడాది కూడా కాకముందే ఆమె మరణించడం నిజంగానే విషాదం నింపేసింది. 100కు పైగా సినిమాల్లో నటించిన సౌందర్యకు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో అభిమానులున్నారు. పేరుకు కన్నడ కస్తూరి అయినా కూడా తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది ఈమె. అప్పట్లోనే స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్న సౌందర్యకు ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయంటారు. అప్పటి లెక్క ప్రకారమే దాదాపు 100 కోట్ల ఆస్తులు సౌందర్యకు ఉన్నట్లు అప్పట్లో కుటుంబ సభ్యులే చెప్పారు.

సౌందర్య 16వ వర్ధంతి (soundarya death anniversary)
సౌందర్య జయంతి (soundarya birth anniversary)


ఇక సినిమాల విషయానికి వస్తే మనవరాలి పెళ్లితో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత అమ్మోరు సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. కెరీర్ కొత్తలోనే పెదరాయుడు, ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో సౌందర్య రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ నెంబర్ వన్ హీరోయిన్‌గా చనిపోయే వరకు కూడా ఉంది. కెరీర్ చివర్లో కూడా సంచలన సినిమాలు చేసింది సౌందర్య.

సౌందర్య జయంతి (soundarya birth anniversary)
సౌందర్య జయంతి (soundarya birth anniversary)


ఆస్తుల విషయానికి వస్తే మొన్నటి వరకు కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తన సోదరుడు అమరనాథ్ సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు సౌందర్య. అయితే ప్రమాదంలో ఇద్దరూ ఒకేసారి మరణించడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. ఇప్పటికీ సౌందర్య ఇంటి నుంచి ఆమె స్థాపించిన కొన్ని విద్యాలయాలకు నిధులు వెళ్తూనే ఉన్నాయి. సౌందర్య చనిపోయిన కొన్ని నెలలకే కుటుంబంలో ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. ఆమె ఆస్తి కోసం భర్త రఘు కూడా చాలా ప్రయత్నాలు చేసాడు.

సౌందర్య 16వ వర్ధంతి (soundarya death anniversary)
సౌందర్య జయంతి (soundarya birth anniversary)


తాను చనిపోయే ఏడాది ముందే అంటే 2003 ఫిబ్రవరి 15న సౌందర్య వీలునామా రాశారని.. అందులో ఉన్నదాని ప్రకారమే తమకు కూడా ఆస్తులు పంచాలని అమర్ నాథ్ భార్య నిర్మల.. ఆమె కుమారుడు సాత్విక్ 2009లో బెంగళూరులోని మెజిస్టేట్ కోర్టును ఆశ్రయించారు. అయితే సౌందర్య ఎలాంటి వీలునామా రాయలేదని.. నిర్మల సోదరుడు న్యాయవాది కావడంతో తప్పుడు వీలునామా సృష్టించారని సౌందర్య తల్లి మంజుల, రఘు కోర్టుకు విన్నవించారు. అప్పటి నుంచి కోర్టులో వివాదం నడుస్తూనే ఉంది.

సౌందర్య 16వ వర్ధంతి (soundarya death anniversary)
సౌందర్య జయంతి (soundarya birth anniversary)


తన అత్త మంజుల, వరుసకు సోదరుడు అయిన రఘు తనపై కక్షసాధిస్తూ దౌర్జన్యం చేస్తున్నారని నిర్మల కోర్టులో కేసు దాఖలు చేసింది. సౌందర్య రాసిన వీలునామా నకిలీ అని ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ నిర్మల న్యాయవాది ధనరాజ్, సౌందర్య భర్త రఘు, ఆమె తల్లి మంజులపై పరువు నష్టం కేసు వేశారు. ఈ వివాదాలతో ఇంత కాలం వీరు కోర్టు చుట్టు తిరిగారు. 2013 డిసెంబర్ 3వ తేదీన రాజీకి వచ్చి ఆస్తులు పంచుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు. మొత్తానికి సౌందర్య చనిపోయిన తర్వాత కూడా ఆమె ఆస్తుల కోసం చాలా వరకు వివాదాలు జరిగాయి. ఏదేమైనా కూడా సౌందర్య లాంటి నటి మరొకరు రారని మాత్రం అంతా ఒప్పుకుని తీరాల్సిందే.
Published by:Praveen Kumar Vadla
First published: