Chiranjeevi Sarja: అక్కడ మళ్లీ విడుదలైన చిరంజీవి సినిమా.. క్యూ కట్టిన ప్రేక్షకులు..

Chiranjeevi Sarja Birth Anniversary: చిరంజీవి సర్జ.. తెలుగులో ఈ పేరుతో పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ కన్నడ ఇండస్ట్రీలో మాత్రం స్టార్ హీరో. నాలుగు నెలల కింద గుండెపోటుతో ఈయన హఠాన్మరణం చెందాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 17, 2020, 9:13 PM IST
Chiranjeevi Sarja: అక్కడ మళ్లీ విడుదలైన చిరంజీవి సినిమా.. క్యూ కట్టిన ప్రేక్షకులు..
చిరంజీవి సర్జ (chiranjeevi sarja)
  • Share this:
చిరంజీవి సర్జ.. తెలుగులో ఈ పేరుతో పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ కన్నడ ఇండస్ట్రీలో మాత్రం స్టార్ హీరో. నాలుగు నెలల కింద గుండెపోటుతో ఈయన హఠాన్మరణం చెందాడు. ఇప్పటికీ ఈయన మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కుటుంబ సభ్యులు అయితే చిరు ఇప్పటికీ మాతోనే ఉన్నాడంటున్నారు. జూన్ 7న ఈయన హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు వదిలాడు. యాక్షన్ కింగ్ అర్జున్‌కు ఈయన మేనల్లుడు. కేవలం 35 ఏళ్ల వయసులోనే చిరంజీవి సర్జ చనిపోయాడు. 2009లో వాయుపుత్ర సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఈయన.. తొలి సినిమాతోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత దాదాపు 25 సినిమాలు చేసాడు చిరంజీవి సర్జ. ఈయన ప్రముఖ కన్నడ హీరోయిన్ మేఘనా రాజ్‌ను 2018లో పెళ్లి చేసుకున్నాడు. ఈమె తెలుగులో అల్లరి నరేష్‌తో బెండు అప్పారావు సినిమాలో నటించింది. 2020లో ఇప్పటికే చిరంజీవి నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి. మరో నాలుగు సినిమాలు షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. మరో అరడజన్ కథలు విన్నాడు ఈ హీరో.
చిరంజీవి సర్జ (chiranjeevi sarja)
చిరంజీవి సర్జ (chiranjeevi sarja)


స్టార్ హీరోగా దూసుకుపోతున్న సమయంలో అర్ధాంతరంగా చనిపోవడం అభిమానులతో పాటు కన్నడ ఇండస్ట్రీ కూడా జీర్ణించుకోలేకపోతుంది. చిరు మరణించి ఇన్ని రోజులవుతున్నా కూడా ఇప్పటికీ ఈయన సినిమాలు మాత్రం థియేటర్‌లో సందడి చేస్తూనే ఉన్నాయి. మార్చిలో చిరంజీవి నటించిన శివార్జున సినిమా విడుదలైంది. అప్పుడు లాక్‌డౌన్ కారణంగా దానికి సరైన కలెక్షన్స్ రాలేదు. ఆ సినిమా విడుదలైన మూడు నెలలకు చిరంజీవి సర్జ హఠాన్మరణం పాలయ్యాడు. దాంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. అప్పుడు విడుదలైనా కరోనా కారణంగా చాలా మంది థియేటర్‌లో చిరంజీవి సినిమా చూడలేకపోయారు. దాంతో మరోసారి ఇప్పుడు ఈ చిత్రాన్ని విడుదల చేసారు.

బెంగళూరులో థియేటర్స్, మల్టీప్లెక్సులు అన్నీ కోవిడ్ నిబంధనలకు లోబడి ఓపెన్ చేసారు. అందులో భాగంగానే శివార్జున సినిమాను మరోసారి విడుదల చేసారు. ఈ సారి మాత్రం చిరును చివరిసారి సిల్వర్ స్క్రీన్‌పై చూడ్డానికి అభిమానులు పోటీ పడుతున్నారు. సగం టికెట్స్ అమ్మినా సరే హౌజ్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. పైగా థియేటర్స్ ముందు ఈ దివంగత హీరోకు కటౌట్స్ కట్టి పాలాభిషేకాలు చేస్తున్నారు. అక్టోబర్ 17న ఈయన జయంతి కారణంగా చిరంజీవి సర్జ చివరగా నటించిన సినిమాల ట్రైలర్స్, టీజర్స్ విడుదలయ్యాయి. అందులో క్షత్రియాతో పాటు రాజమార్తండ ఉన్నాయి. ఈ రెండు సినిమాలు ఇంకా విడుదల కాలేదు. వీటి షూటింగ్ పూర్తైన తర్వాత చిరు చనిపోయాడు. వీటికి డబ్బింగ్ చిరు తమ్ముడు ధృవ సర్జ చెప్తున్నాడు.
Published by: Praveen Kumar Vadla
First published: October 17, 2020, 9:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading