హోమ్ /వార్తలు /సినిమా /

Puneeth Rajkumar Naatu Naatu song: పునీత్ రాజ్‌కుమార్ ‘నాటు నాటు’ పాటకు స్టెప్పులేస్తే ఇలా ఉంటుందా..?

Puneeth Rajkumar Naatu Naatu song: పునీత్ రాజ్‌కుమార్ ‘నాటు నాటు’ పాటకు స్టెప్పులేస్తే ఇలా ఉంటుందా..?

ఏంటి.. పునీత్ రాజ్‌కుమార్ చనిపోయి అప్పుడే 30 రోజులు అయిపోయిందా..? కాలం ఇంత వేగంగా వెళ్లిపోయిందా..? నిన్నగాక మొన్న ఆయన మరణించినట్లు అనిపిస్తుంది అప్పుడే నెల రోజులు అయిందా అంటూ అభిమానులతో పాటు అంతా ఆశ్చర్యపోతున్నారు. పునీత్ కన్నుమూసి 30 రోజులు గడిచినా కూడా ఇప్పటికీ కన్నడిగులు ఆయన ఆలోచనల్లోంచి బయటికి రాలేకపోతున్నారు. ఇప్పటికీ పునీత స్మరణం చేస్తూనే ఉన్నారు.

ఏంటి.. పునీత్ రాజ్‌కుమార్ చనిపోయి అప్పుడే 30 రోజులు అయిపోయిందా..? కాలం ఇంత వేగంగా వెళ్లిపోయిందా..? నిన్నగాక మొన్న ఆయన మరణించినట్లు అనిపిస్తుంది అప్పుడే నెల రోజులు అయిందా అంటూ అభిమానులతో పాటు అంతా ఆశ్చర్యపోతున్నారు. పునీత్ కన్నుమూసి 30 రోజులు గడిచినా కూడా ఇప్పటికీ కన్నడిగులు ఆయన ఆలోచనల్లోంచి బయటికి రాలేకపోతున్నారు. ఇప్పటికీ పునీత స్మరణం చేస్తూనే ఉన్నారు.

Puneeth Rajkumar Naatu Naatu song: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar Naatu Naatu song) పేరు అభిమానులు మాత్రమే కాదు.. ప్రేక్షకులు కూడా ఇప్పట్లో మరిచిపోవడం అసాధ్యమే. ఎందుకంటే సౌత్ సినిమాపై ఆయన వదిలేసిన ప్రభావం అలా ఉంది మరి. తాజాగా ఈయన అభిమానులు చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఇంకా చదవండి ...

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ పేరు అభిమానులు మాత్రమే కాదు.. ప్రేక్షకులు కూడా ఇప్పట్లో మరిచిపోవడం అసాధ్యమే. ఎందుకంటే సౌత్ సినిమాపై ఆయన వదిలేసిన ప్రభావం అలా ఉంది మరి. పునీత్ కేవలం నటుడిగానే కాదు మానవతా మూర్తిగా అందరి గుండెల్లో నిలిచిపోయాడు. ఆయన మరణించిన తర్వాత ఇంకా ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. ఆయన ఉన్నపుడు కేవలం కన్నడలో మాత్రమే స్టార్ హీరో.. కానీ చనిపోయాక అన్ని ఇండస్ట్రీల్లోనూ పునీత్ సూపర్ స్టార్. ఆయన గురించి మాట్లాడుతుంటే ఏదో తెలియని గర్వం.. మోహంపై ఒక చిరునవ్వు.. అంతలోనే ఆయన లేడనే బాధ అన్నీ ఎమోషన్స్ ఒకేసారి వస్తున్నాయి. ఒక మనిషిపై ఇంత ప్రేమ ఎలా ఉంటుందబ్బా అనేలా ప్రేమతో పాటు అభిమానం కూడా సంపాదించుకున్నాడు పునీత్ రాజ్‌కుమార్.

ఈయనలో అద్భుతమైన డాన్సర్ ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే మన అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ కంటే గొప్ప డాన్సర్ పునీత్ రాజ్‌కుమార్. ఒప్పుకోడానికి ఇది కాస్త కష్టంగా అనిపించినా.. ఒక్కసారి పునీత్ చేసిన డాన్సులు చూస్తే ఇదే విషయం అర్థమవుతుంది. కన్నడ ఇండస్ట్రీలో ఉన్న ఏకైక బెస్ట్ డాన్సర్ పునీత్. ఆయన్ని మించిన డాన్సర్ అక్కడ మరొకరు లేరు.. ఇకపై రారు కూడా. అప్పు డాన్స్ చేస్తుంటే అలా చూస్తుండిపోతారు కన్నడిగులు. కేవలం ఆయన డాన్సుల కోసమే థియేటర్స్‌కు వచ్చే అభిమానులు కూడా అక్కడున్నారు. ఇకపై జీవితంలో అప్పు డాన్సులు చూడలేమని తెలిసి వాళ్లు రోదిస్తున్నారు.

Puneeth Rajkumar biopic: పునీత్ రాజ్‌కుమార్ బయోపిక్‌కు రంగం సిద్ధం.. దర్శకుడు ఎవరంటే..?


Bigg Boss 5 Telugu: 12వ వారం బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేషన్ అయ్యేది ఎవరో తెలిసిపోయింది..!

ఇదిలా ఉంటే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఒకవేళ పునీత్ రాజ్‌కుమార్ డాన్స్ చేస్తే.. ఎలా చేస్తాడు అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన ఓ డాన్స్ మ్యాషప్ చేసి పోస్ట్ చేసారు అభిమానులు. ఇదిప్పుడు వైరల్ అవుతుంది. అందులో పునీత్ పాత సినిమాల్లోని స్టెప్పులన్నీ ఒకే దగ్గర కలిపి వీడియో చేసారు. నాటు నాటు కన్నడ వర్షన్ సాంగ్‌లో పునీత్ స్టెప్పులు ఎడిట్ చేసారు. ఈ వీడియోను చూసుకుని ఇప్పుడు పునీత్ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. ఇక ఈ వీడియోకి నెటిజన్స్ తెగ ఫిదా అవుతున్నారు.

ట్రిపుల్ ఆర్ టీమ్ కూడా పునీత్ పాటను చూసి పులకరించపోయింది. పునీత్‌ అభిమాని ఒకరు ఈ ‘నాటు నాటు’ పాటను అద్భుతంగా రీ క్రియేట్‌ చేశాడు. పునీత్ వేసిన డ్యాన్స్‌ స్టెప్పులకు కన్నడ వెర్షన్ మాషప్‌ను సెట్ చేసాడు. అంతేకాదు.. టాలీవుడ్ టాప్ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ కూడా ఈ పాటలో ఓ సందర్భంలో కనిపించాడు. పునీత్ రాజ్‌కుమార్‌తో కలిసి ఎన్నో హిట్ సాంగ్స్‌కు వర్క్ చేసాడు జానీ మాస్టర్. మొత్తానికి నాటు నాటు అంటూ కన్నడ ప్రేక్షకులను చనిపోయిన తర్వాత పునీత్ అలరిస్తున్నాడు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Kannada Cinema, Puneeth RajKumar, RRR, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు