రాజమౌళికి వార్నింగ్ ఇస్తున్న సుశాంత్ సింగ్ అభిమానులు..

Sushant Singh Rajput Rajamouli: అదేంటి.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో రాజమౌళికి ఏంటి సంబంధం..? ఆయన చనిపోతే ఈయనకెందుకు అభిమానులు వార్నింగ్ ఇస్తున్నారు అనుకుంటున్నారా..?

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 18, 2020, 2:59 PM IST
రాజమౌళికి వార్నింగ్ ఇస్తున్న సుశాంత్ సింగ్ అభిమానులు..
సుశాంత్ సింగ్ రాజమౌళి (sushant singh rajput rajamouli)
  • Share this:
అదేంటి.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో రాజమౌళికి ఏంటి సంబంధం..? ఆయన చనిపోతే ఈయనకెందుకు అభిమానులు వార్నింగ్ ఇస్తున్నారు అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇండియాలో ఏ ఇండస్ట్రీలో చూసినా కూడా అందరూ మాట్లాడుకునేది యంగ్ సెన్సేషనల్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణం గురించే. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ నటుడు ఆత్మహత్య చేసుకోవడం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా ఆయన సొంత రాష్ట్రం బీహార్‌లో అభిమానులు రోడ్లమీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. దానికి కారణం బాలీవుడ్ బడా బాబులే అంటూ వాళ్లు మండి పడుతున్నారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (sushant singh rajput)
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (sushant singh rajput)


బాలీవుడ్‌ను వాళ్లంతా గుప్పిట్లో పెట్టుకుని ఆడుకుంటున్నారని.. కొత్త టాలెంట్ వచ్చినా కూడా ఎంకరేజ్ చేయడం లేదని.. అలాగే తమ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను చచ్చిపోయేలా చేసారని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సూపర్ స్టార్ అవుతాడని కలలు కన్న తమ హీరోను నిర్ధాక్షణ్యంగా కొందరు సిండికేట్ అయి మరీ సూసైడ్ చేసుకునేలా చేసారని వాళ్లు ఆరోపిస్తున్నారు. ఇది ఆత్మహత్య కాదు పక్కా ప్లానింగ్‌తో చేసిన హత్యే అంటూ బీహారీలతో పాటు మరికొందరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సుశాంత్ సింగ్ రాజమౌళి (sushant singh rajput rajamouli)
సుశాంత్ సింగ్ రాజమౌళి (sushant singh rajput rajamouli)


ఈ క్రమంలోనే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణంలో హీరోయిన్ అలియా భట్ పేరు కూడా వినిపిస్తుంది. ఈమె కూడా గతంలో చాలాసార్లు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కరణ్ జోహార్ షోలో అతడిపై కుళ్లు జోకులు కూడా వేసింది. అంతేకాదు.. సుశాంత్‌ను చంపేసి రణ్‌బీర్‌ను పెళ్లి చేసుకుంటానంటూ మాట్లాడింది. అవన్నీ ఇప్పుడు బయటికి వస్తున్నాయి. దాంతో ఇప్పుడు రాజమౌళికి కూడా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు.

సుశాంత్ సింగ్ అలియా భట్ (sushant singh rajput alia bhatt)
సుశాంత్ సింగ్ అలియా భట్ (sushant singh rajput alia bhatt)


మీరు తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్ నుంచి అలియాను తొలగించండి.. లేకపోతే మీ సినిమాను ఉత్తరాదిన విడుదల కానివ్వమంటూ వార్నింగులు వస్తున్నాయి. బాయ్‌కాట్ బాలీవుడ్ నినాదంలో అలియా భట్ సినిమాలు కూడా ఉన్నాయి. మీపై మాకు గౌరవం ఉంది.. బాహుబలితో ఇండియన్ సినిమా స్థాయిని పెంచారు.. అలాంటి మీ సినిమాలో టాలెంట్ లేని అలియాను పెట్టుకుని అనవసరంగా మా కోపానికి గురి కాకండి అంటూ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. అయితే ట్రిపుల్ ఆర్ విడుదలకు చాలా సమయం ఉంది. అప్పటి వరకు ఈ కోపాలు తగ్గుతాయో లేదంటే నిజంగానే ప్రభావం చూపిస్తాయో చూడాలిక.
Published by: Praveen Kumar Vadla
First published: June 18, 2020, 2:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading