హైదరాబాద్‌లో జూబ్లి హిల్స్, ఫిల్మ్ నగర్లో ఎలాగైతే సినిమా వాళ్లు ఎక్కువగా ఉంటారో అలాగే ముంబైలో జుహు ప్రాంతం కూడా అంతే. అక్కడ కూడా అంతా బాలీవుడ్ సెలబ్రిటీల ఉంటారు. ఒక్కముక్కలో చెప్పాలంటే వాళ్లకు కేరాఫ్ అడ్రస్ ఆ ఏరియా. అక్కడే చాలా మంది బాలీవుడ్ స్టార్స్ ఇల్లు కొనుక్కొని సెటిల్ అయిపోయారు. ఎంతోమంది అక్కడే ఆస్తులు కూడా కొనుగోలు చేసారు. అక్కడ కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు కూడా. ఇప్పుడు శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా ఇదే చేసింది. ముంబైలోని జుహు ఏరియాలో ఈమె కూడా సొంతిటి కలను నిజం చేసుకుంది. ఇప్పటికే అలియా భట్, రణ్‌బీర్ కపూర్, హృతిక్ రోషన్ వంటి సూపర్ స్టార్స్ అక్కడ ఇల్లు తీసుకున్నారు. ఇప్పుడు వాళ్లకు తోడుగా జాన్వీ కూడా చేరిపోయింది. జుహు ప్రాంతంలో 39 కోట్ల రూపాయలతో ఓ ఖరీదైన ఇంటిని సొంతం చేసుకుంది జాన్వీ. ఇండస్ట్రీకి వచ్చింది 2018లో.. చేసింది రెండు సినిమాలు మాత్రమే.. కానీ అప్పుడే 40 కోట్లు పెట్టి ఇల్లు కొనేసింది అంటే జాన్వీని చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్ అంతా ఇదే టాపిక్ హాట్ హాట్‌గా నడుస్తుంది.
జాన్వీ కొత్త ఇల్లు జుహు భవనంలో మూడు అంతస్తులలో ఉంది. ఇంటి కొనుగోలుకు సంబంధించిన ఒప్పందం గతేడాది డిసెంబర్ 7 జరిగిందని తెలుస్తుంది. ఈ ఇంటి విస్తీర్ణం మొత్తం 3,456 చదరపు అడుగులు కాగా.. ఈ ఇంటికి సంబంధించి 78 లక్షల రూపాయల స్టాంప్ డ్యూటీని జాన్వీ కపూర్ చెల్లించినట్లు బాలీవుడ్ కథనాలు చెప్తున్నాయి. శ్రీదేవి చనిపోయిన తర్వాతే ధడక్ సినిమాతో 2018లో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్.
ఆ సినిమా పర్లేదనిపించింది. ఆ తర్వాత 2020లో గుంజన్ సక్సెనాతో వచ్చింది. ఈ చిత్రం ఓటిటిలో విడుదలైంది.. పర్లేదనిపించింది. జోయా అక్తర్ ఘోస్ట్ సిరీస్‌లో కూడా కనిపించారు. ప్రసుత్తం దోస్తానా 2, రూహి అఫ్జానా చిత్రాల్లో నటిస్తుంది జాన్వీ కపూర్. ఏదేమైనా కూడా చాలా అంటే చాలా త్వరగా బాలీవుడ్ నీళ్లు ఒంట పట్టించుకుంది జాన్వీ. అందుకే ఇంత త్వరగా ఇంటి పట్టు ఏర్పరుచుకుంది ఈ ముద్దుగుమ్మ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Hindi Cinema, Janhvi Kapoor