news18-telugu
Updated: July 9, 2020, 3:35 PM IST
యువ గాయనికి లతా మంగేష్కర్ ప్రశంసలు (Twitter/Photo)
లతా మంగేష్కర్.. ఆమె పేరే ఓ బ్రాండ్. ఆమె గానానికి వసంతమే తప్ప శిశిరం లేదు. భావమే తప్ప భాష తెలీదు. ఆ గళంలో జాలువారే పాట వింటే ఆ గాన మాధుర్యానికి సాటి, పోటి రాగల గళం మరోకటి లేదనిపించేంతటి తీయని గానం ఆమెది. దశాబ్దాలు గడిచిన మాధుర్యం తరగని స్వరం ఆమె సొంతం. ఆమె గానానికి అత్యున్నత భారత రత్న పురస్కారం దాసోహమైంది. అలాంటి లతా మంగేష్కర్ ఓ యువగాయని సామదిప్తా ముఖర్జీ పాడిన పాటకు పరవశురాలైంది. అంతేకాదు ఆ గాయని పాడిన పాటకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసి ఆ యువ గాయనిని అభినందించింది. ఆస్ట్రియన్ మొజార్డ్ 40వ వాద్య గోష్టిని మన భారతీయ రాగంతో ఆలపించిన ఆ గాయని మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను. ఆమెకు నా ఆశీర్వాదాలు ఎపుడు ఉంటాయని లతా ట్వీట్ చేసింది.
ఎక్కడో విదేశీ సంగీతానికి భారతీయ స్వరాలు జోడించి పాడిన క్లాసికల్ సింగర్ సామదిప్తా ముఖర్జీ.. లతా ప్రశంసలకు ఎంతో పొంగిపోయింది. అంతేకాదు మీలాంటి లెజెండరీ సింగర్ అభిమానాన్ని పొండటం కన్న గొప్ప గుర్తింపు ఏమి ఉండదు. ఇంతకు మించి నాకు కావాల్సింది ఏముంది. సంగీతం ప్రపంచంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిందుకు నేను కృషి చేస్తున్నాను అంటూ సామదీప్తా తన ట్వీట్లో పేర్కొంది.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
July 8, 2020, 5:07 PM IST