ఇంటికి చేరుకున్న లతా మంగేష్కర్... ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన గానకోకిల

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న లతకు ముంబయి బ్రీచ్‌ కాండీ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో చికిత్స అందించారు. న్యుమోనియా, ఛాతిలో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆమె కోలుకున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

news18-telugu
Updated: December 8, 2019, 11:14 PM IST
ఇంటికి చేరుకున్న లతా మంగేష్కర్... ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన గానకోకిల
లత మంగేష్కర్‌
  • Share this:
తీవ్ర అస్వస్థతతో ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ సీనియర్ గాయని లతామంగేష్కర్ తర్వాత ఇల్లు చేరారు. ఈ సందర్భంగా ఆమె తానిప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, తన క్షేమాన్ని కాంక్షించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. భారతరత్న అవార్డు గ్రహీత అయిన 90 ఏళ్ల లత మంగేష్కర్ న్యూమోనియా ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. సుమారు 28 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం ఆమె ఇంటికి చేరుకున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న లతకు ముంబయి బ్రీచ్‌ కాండీ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో చికిత్స అందించారు. న్యుమోనియా, ఛాతిలో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆమె కోలుకున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>