LASYA THREATENS THULASI IN TODAYS EPISODE INTINTI GRUHALAKSHMI SERIAL NR
Intinti Gruhalakshmi: ఇంటిని వల్లకాడు చేస్తా.. తులసికి వార్నింగ్ ఇచ్చిన లాస్య..?
Intinti Gruhalakshmi
Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాస్త విభిన్నమైన కథతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ రేటింగ్ విషయంలో రెండో స్థానంలో ఉంది.
Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాస్త విభిన్నమైన కథతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ రేటింగ్ విషయంలో రెండో స్థానంలో ఉంది. ఇక రోజు రోజుకు మరింత ఆసక్తిగా ఉండటంతో ప్రేక్షకులను ఈ సీరియల్ కు మరింత దగ్గరయ్యారు. మాధవి తన భర్త విడాకులు ఇస్తాడని, ఇంట్లో వాళ్లకి చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నందు మోహన్ పై అరవడం తిరిగి మోహన్ నందుని అనడం జరిగింది. ఇక నందు ఇంటి బాధ్యతలు లాస్య కు అప్పగిస్తానని.. నందు అనడంతో ఆ విషయం గురించి ఆలోచిస్తుంది తెలిసి.
ఇక తులసి దగ్గరకు లాస్య సీన్ రివర్స్ అయింది అనుకుంటూ తన మాటలతో రెచ్చగొడుతుంది. ఇక తులసి అంతటితో ఆగక నాకు నమ్మకం ఉందంటూ, నువ్వు సంబర పడకు అంటూ వార్నింగ్ చేస్తుంది. కానీ లాస్ట్ గా కూడా తగ్గకుండా.. ఏంటి నీ కూల్చడం నాకు పెద్ద కష్టం కాదు అంటూ అంకుల్ కి రండి బీపీ టాబ్లెట్ ఎక్కువ కావచ్చు, ఆంటీ కి రెండు షుగర్ టాబ్లెట్స్ తక్కువ కావచ్చు, దివ్య మెట్ల మీద నుంచి కింద పడొచ్చు, ప్రేమ్ బైక్ పైన వెళ్తుంటే యాక్సిడెంట్ అవ్వచ్చు అని.. అందర్నీ దూరం చేస్తానంటూ.. ఈ లోకం నుంచైనా దూరం చేస్తా అని లాస్య.. తులసితో గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది.
ఇక తులసికి తన మామగారికి లాస్య విషం కలిపిన పాలు ఇచ్చినట్టు, దాంతో నోటి నుండి నురగ రావడంతో ఒకేసారి నిద్రలో నుండి మెలుకుంటుంది. అది కల అని ఊపిరి పీల్చు కుంటుంది. ఇక మరునాడు ఉదయం లాస్య తన మామగారికి పాలు ఇవ్వడానికి వచ్చినప్పుడు కల నిజం అవుతుంది అనుకొని ఆ పాలు తాగకుండా ఆపుతుంది తులసి. ఇక ఆ పాలని లాస్య తాగుతూ తులసిని నందు తో ఇరికిస్తుంది. ఇక నందు తులసిపై అరుస్తూ.. భార్య స్థానంలో లాస్య ఉంటుందని బలంగా చెప్పటంతో తులసి కోపం తో ఎదురు తిరుగుతుంది. నందుని తన మాటలతో గట్టిగా మాట్లాడుతుంది తెలుస్తుంది. ఇక లాస్య స్థానాన్ని గురించి తులసి కోపంతో తన మాటలతో రగిలిపోతూ.. లాస్య ను బయటకి తోస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తరువాయి భాగంలో చూడాలి.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.