Home /News /movies /

LASYA MANJUNATH REVEALS MOSQUITO MENACE IN BIGG BOSS HOUSE MNJ

Bigg Boss 4 Lasya: బిగ్‌బాస్ హౌస్‌లో చాలా దోమలుండేవి..లాస్య మంజునాథ్‌ సంచలన కామెంట్స్

లాస్య మంజునాథ్

లాస్య మంజునాథ్

బుల్లితెర‌పై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 4(Bigg Boss 4) ముగిసింది. ఈ సీజ‌న్ విన్న‌ర్‌గా అభిజీత్(Abijeet) నిల‌వ‌గా.. అఖిల్(Akhil) ర‌న్న‌ర్‌గా మిగిలారు. కాగా ఈ సీజ‌న్‌లో ప్రముఖ యాంక‌ర్ లాస్య మంజునాథ్(Lasya Manjunath) కూడా పాల్గొన్న విష‌యం తెలిసిందే

ఇంకా చదవండి ...
  Lasya Bigg Boss 4: బుల్లితెర‌పై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 4 ముగిసింది. ఈ సీజ‌న్ విన్న‌ర్‌గా అభిజీత్ నిల‌వ‌గా.. అఖిల్ ర‌న్న‌ర్‌గా మిగిలారు. కాగా ఈ సీజ‌న్‌లో ప్రముఖ యాంక‌ర్ లాస్య మంజునాథ్ కూడా పాల్గొన్న విష‌యం తెలిసిందే. 11 వారంలో ఆమె హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యి బ‌య‌ట‌కు వ‌చ్చింది. కాగా ఇటీవ‌ల లాస్య ఓ వీడియోను విడుద‌ల చేసింది. అందులో హౌజ్‌లో నుంచి వ‌చ్చిన త‌రువాత త‌న‌కు ఎదురైన ప్ర‌శ్న‌ల‌కు లాస్య స‌మాధానం ఇచ్చింది. ఈ వీడియోను త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి లాస్య చేసింది. వారు ఒక్కో ప్ర‌శ్న‌ను వేస్తుండ‌గా.. వాటికి లాస్య ఆన్స‌ర్ చెప్పింది.

  మొద‌ట‌గా లాస్య అన్న కూతురు మాట్లాడుతూ.. అత్త బిగ్‌బాస్ హౌజ్‌లో దోమ‌లుంటాయా..? అని ప్ర‌శ్నించ‌గా.. ఎందుకుండ‌వు. అది కూడా హౌజ్ కదా. కానీ డోర్లు బాగా వేయ‌డం వ‌ల‌న‌ లోప‌లికి వ‌చ్చేవి కాదు గానీ.. గార్డెన్ ఏరియాలో కూర్చున్న‌ప్పుడు దోమ‌లు మ‌మ్మ‌ల్ని కుట్టేవి అని చెప్పింది. ఇక మంజునాథ్ అమ్మ‌మ్మ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ ఎక్కడ కూర్చొని మాట్లాడుతాడు..? అన్న ప్ర‌శ్న‌కు.. దీనికి స‌మాధానం మాకు కూడా తెలీదు. ఎక్క‌డి నుంచో వాయిస్ వ‌స్తుంటుంది. అయితే క‌న్ఫెష‌న్ రూమ్ ప‌క్క‌న ఒక చిన్న రూమ్‌లో ఉంటాడ‌ని మేము అనుకునేవాళ్లం అని చెప్పింది.

  ఇక రాత్రి మిగిలిన అన్నాన్ని ఏం చేస్తారు..? అన్న ప్ర‌శ్న‌కు.. ఇంట్లో లాగానే పులుసన్నం, ఎగ్ ఫ్రైడ్ రైస్‌, ట‌మాటో రైస్ అలా చేసేదాన్ని. కానీ పొద్దుపొద్దునే రైస్ తినేందుకు ఎవ్వ‌రూ ఇష్ట‌ప‌డేవాళ్లు కాదు. అందులో చ‌ల్ల‌గా అయిన అన్నంను ఎవ‌రూ తినేవారు కాదు అని చెప్పింది. ఇక వేక‌ప్ సాంగ్ గురించి లాస్య మ‌ర‌ద‌లు ప్ర‌శ్నించ‌గా.. ఎవ‌రు ప్లే చేస్తారో నాకు తెలీదు. డైరెక్ష‌న్ టీమ్‌లో ఎవ‌రో ఒక‌రు అని అనుకునేవాళ్లం. మేము ఉండేది చెక్కతో త‌యారు చేసిన ఇంట్లో కాబ‌ట్టి.. బ‌య‌ట నుంచి చిన్న చిన్న‌గా శ‌బ్దాలు వినిపించేవి. అవి క్లారిటీగా ఉండేవి కాదు అని స‌మాధానం ఇచ్చింది. ఇక ఉద‌యం వేసే పాటల‌ను బ‌ట్టే మీ డే ఎలా ఉండ‌బోతోందో తెలిసేదా..? అని మంజునాథ్ ప్ర‌శ్నించ‌గా.. ఒక్కోసారి అనిపించేది అని తెలిపింది.

  ఇక అక్క‌డ నీళ్ల‌తో ఏదైనా ఇబ్బంది ఉండేదా..? అన్న ప్ర‌శ్న‌కు.. ఏదో టాస్క్‌ల కోసం మిన‌హాయిస్తే త‌మ‌కు ఎప్పుడూ నీళ్ల‌తో ఇబ్బంది రాలేద‌ని చెప్పింది. ఇక బిగ్‌బాస్ హౌజ్‌లో వాషింగ్ మెషిన్లు ఉంటాయా..? అన్న ప్ర‌శ్న‌కు అవేమీ ఉండ‌వు. శుక్ర‌వారం మేము మా ప‌నుల‌ను చేసుకునేవాళ్లం. శ‌నివారం స్పెష‌ల్ ఎపిసోడ్‌కి అప్ప‌టి నుంచే రెడీ అయ్యే వాళ్లం అని తెలిపింది. ఇక హౌజ్‌లో పూజ‌లు అలాంటివి ఏం ఉండ‌వా..? అన్న ప్ర‌శ్న‌కు అలాంటివి ఏం ఉండ‌వు. అంద‌రూ ఒకటే అని బిగ్‌బాస్ అనుకుంటారు కాబ‌ట్టి.. లోప‌లికి ఏం తీసుకెళ్ల‌నివ్వ‌రు. మ‌న ఇంట్లో వారి ఫొటోలు కూడా తీసుకెళ్ల‌నివ్వ‌రు అని చెప్పింది.

  ఇక పవ‌ర్ క‌ట్స్ ఉంటాయా..? అన్న ప్ర‌శ్న‌కు.. మాకు అంత తెలీదు. ఎందుకంటే మాకు ఎప్పుడు లైట్లు ఆన్‌లోనే ఉండేవి. రాత్రి పూట కూడా నైట్ విజ‌న్ కెమెరాల కోసం కొన్ని లైట్లు వేస్తారు. అయితే ఎప్పుడైనా జ‌న‌రేట‌ర్ సౌండ్ వినిపించేది. అప్పుడు క‌రెంట్ పోయింది అని అనుకునే వాళ్లం అని లాస్య చెప్పింది. అలాగే మిగిలిన ప్రశ్నలకు కూడా సమాధానమిచ్చిన లాస్య.. కొన్నింటికి ఆఫ్ రికార్డులో సమాధానం ఇస్తానని చెప్పారు.
  Published by:Manjula S
  First published:

  Tags: Anchor lasya, Bigg Boss 4 Telugu, Televison News

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు