Home /News /movies /

LAST THREE DAYS TO WATCH RRR IN DOLBY ATOMS IN NORTH AMERICA HERE ARE THE DETAILS SR

RRR : ఆర్ ఆర్ ఆర్ సినిమాను చూసే వారికి చేదు వార్త.. కేవలం మూడు రోజులు మాత్రమే..

RRR Photo : Twitter

RRR Photo : Twitter

RRR : ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం)  (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది.

ఇంకా చదవండి ...
  ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం)  (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. అది అలా ఉంటే ఈ సినిమా ఐమ్యాక్స్ ఫార్మాట్‌తో పాటు 3D, డాల్బీ అట్మాస్ వంటి అధునాతన ఫార్మాట్స్‌లో స్క్రీనింగ్ అవుతోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సౌలభ్యం ఇంకా మూడు రోజులు మాత్రమే ఉండనుందట. వివరాల్లోకి వెళితే.. ఆర్ ఆర్ ఆర్ అమెరికాలో వెయ్యికి పైగా థియేటర్స్‌లో విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఇప్పటికే అక్కడ తొమ్మిది మిలియన్ డాలర్స్‌ను వసూలు చేసింది. అయితే ప్రీమియం ఫార్మాట్ అయిన డాల్బీ విజన్, సినిమార్క్ XD ప్రదర్శనలు USAలో మొదటి వారం మాత్రమే ఉండనున్నాయట. దీంతో ఈ ఫార్మాట్స్‌లో సినిమా చూడటానికి ఇంకా మూడు రోజులే ఉంది. రెండవ వారం నుండి రెగ్యులర్/స్టాండర్డ్ ఆర్ ఆర్ ఆర్ ప్రింట్ ప్రదర్శించబడుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల గ్రాస్‌ను అందుకుంది. ఫస్ట్ మండే కూడా ఓ రేంజ్‌లో హోల్డ్ చేసిందని అంటున్నారు.

  ఇక ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల హుషారైనా పాట ఎత్తర జెండా వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట ను విశాల్ మిశ్రా, పృధ్వీ చంద్ర, ఎంఎం కీరవాణి, సాహితి చాగంటి, హారిక నారాయణ్‌లు పాడారు. హుషారుగా సాగుతున్న ఈ పాట ఆర్ ఆర్ ఆర్ అభిమానులకి మరింత ఎనర్జీ ఇస్తోంది. ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేశారు.


  ఇక మరోవైపు ఈ సినిమా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో కూడా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో రిలీజ్ కాలేదు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ప్రసాద్స్ ఐమ్యాక్స్‌లో ఈ సౌలభ్యం లేకపోవడంతో ఈ సినిమాను చూడాలనే వారికి ఇది చేదువార్తనే చెప్పోచ్చు. ఆర్ ఆర్ ఆర్  (RRR) విషయానికి వస్తే.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హిందీ నటి ఆలియా భట్ (Olivia Morris, Alia Bhatt) నటించారు.  అజయ్ దేవ్‌గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించారు. మరోవైపు ఈ  (RRR) చిత్రం ఓటిటి రిలీజ్‌ ఎప్పుడు ఉండనుందో అనే విషయంలో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయికాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఆర్ ఆర్ ఆర్  (RRR) విడుదలైన 60 రోజులకు ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని అంటున్నారు.ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని టాక్. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

  ఈ సినిమా నార్త్‌ ఇండియన్‌ థియేట్రికల్‌ రైట్స్‌తో పాటు శాటిలైట్‌ రైట్స్‌ ను ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భారీ మొత్తానికి దక్కించుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలైంది. ఇక అది అలా ఉంటే ఆలియా భట్ తన బాయ్ ఫ్రెండ్‌ రణబీర్ కపూర్‌ను అతి త్వరలో పెళ్లి చేసుకోనున్నారని తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట.. తమ ప్రేమను మరో మెట్టు ఎక్కించాలని ప్లాన్ చేస్తోందట. అందులో భాగంగా ఈ జం 2022లో వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారని తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో పెళ్లి పీటలను ఎక్కబోతున్నట్టు టాక్. ఇక వీరిద్దరూ కలిసి నటిస్తున్న భారీ ప్యాన్ ఇండియా చిత్రం బ్రహ్మాస్త్రం విడుదల రెడీ అవుతోంది.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: RRR, Tollywood news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు