హోమ్ /వార్తలు /సినిమా /

Bellbottom: ఇందిరా గాంధీలా కనిపించేందుకు ఈ నటి ఎంత కష్టపడిందో చూశారా?

Bellbottom: ఇందిరా గాంధీలా కనిపించేందుకు ఈ నటి ఎంత కష్టపడిందో చూశారా?

Lara Dutta

Lara Dutta

Bellbottom: సినిమాలలో ఎక్కువగా నటుల పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అలా కొన్నిసార్లు నటుల పాత్రలను తెరపై చూపించడానికి కొన్ని లుక్ లను మారుస్తుంటారు.

Bellbottom: సినిమాలలో ఎక్కువగా నటుల పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అలా కొన్నిసార్లు నటుల పాత్రలను తెరపై చూపించడానికి కొన్ని లుక్ లను మారుస్తుంటారు. ఇక ముఖ్యంగా చారిత్రాత్మక సినిమాలలో లేదా ఏదైనా రాజకీయ నాయకుల నేపథ్యంలో తెరకెక్కే సినిమాలలో అచ్చం వారిలా ఉండటానికి నటుల ముఖ చిత్రాలను మేకప్ తో అలాగే తయారుచేస్తుంటారు. ఇక డబల్ యాక్షన్ సినిమాలలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఒక నటుడు ఎలా ఉంటాడో.. అతడికి డబల్ యాక్షన్ గా మరో నటుడిని కూడా అలాగే తయారు చేస్తారు.

ఇప్పటికీ అలా ఎన్నో సినిమాలలో డబల్ యాక్షన్ పాత్రలలో ఎంతో మంది నటులు ఒకేలా ఉండటంతో.. అందులో అసలైన నటుడు ఎవరా అని గుర్తు పట్టడానికి కష్టంగా ఉండేది. అలాంటిది తాజాగా మరో బాలీవుడ్ సినిమాలో కూడా రాజకీయ నాయకురాలి పాత్ర ఉండటంతో.. ఆమెను అచ్చం అలాగే చేశారు. ఇంతకీ ఆ పాత్ర ఎవరో కాదు ఇందిరాగాంధీ. ఇక ఆ పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ నటించింది.

ప్రస్తుతం రంజిత్ ఎం తివారీ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా 'బెల్ బాటమ్'. ఈ సినిమా స్పై థ్రిల్లర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 1984లో జరిగిన విమానాల హైజాక్స్ నేపథ్యంలో రూపొందుతుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ 'రా' ఏజెంట్ బెల్ బాటమ్ గా కనిపించనున్నాడు. అప్పట్లో ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ సమయంలో జరుగగా.. ఈ సినిమా ఈ నెల 19న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.


దీంతో ఇందులో అచ్చం ఇందిరా గాంధీ పాత్రను దించి వేయగా ఈ పాత్రలో కనిపిస్తుంది హీరోయిన్ లారాదత్తా. ఇందులో లారాదత్తా ను గుర్తుపట్టడం చాలా కష్టంగా ఉండగా.. ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ ఫోటోను చూసిన నెటిజన్లు నిజంగా ఇందిరాగాంధీ ఉన్నట్లుగా ఉంది అని ఆశ్చర్యపోతున్నారు. మేకప్ వల్ల ఏదైనా సాధ్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

First published:

Tags: Akshay Kumar, Bell bottom trailer, Bellbottom, Indira Gandhi, Lara Dutta

ఉత్తమ కథలు