LAKSHMIS NTR MOVIE RELEASE DATE FIX IN ANDHRA PRADESH TA
ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్కు ముహూర్తం ఫిక్స్.. ఎంత వరకు వర్కౌట్ అవుతుంది..
ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల
మొత్తానికి వివాదాలతో మొదలైన రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను మార్చి 29 తెలుగు దేశం వ్యవస్థాపక దినోత్సవం రోజున ఏపీలో కాకుండా తెలంగాణతో పాటు ఓవర్సీస్లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఏపీలో ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
మొత్తానికి వివాదాలతో మొదలైన రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను మార్చి 29 తెలుగు దేశం వ్యవస్థాపక దినోత్సవం రోజున ఏపీలో కాకుండా తెలంగాణతో పాటు ఓవర్సీస్లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు ఏపీ కాకుండా విడుదలైన అన్ని ఏరియాల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. 1989లో ఎన్టీఆర్ ఓటమిపాలైన తర్వాత లక్ష్మీ పార్వతి అన్నగారి జీవితంలో ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటన నేపథ్యంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కించాడు రామ్ గోపాల్ వర్మ. అంతా కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి రెస్పాన్సే వచ్చింది. ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ..తనదైన కోణంలో చంద్రబాబు పాత్రను విలన్గా చిత్రీకరించి.. లక్ష్మీ పార్వతి పాత్రను ఉదాత్తమైనదిగా ఈ సినిమాలో చూపించడం కొంత మందికి నచ్చకపోయినా ..ఓవరాల్గా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది.
Finally #LakshmisNTR is now releasing on MAY 1ST in ANDHRA PRADESH ..Come watch the conspiracies that happened behind NTR ‘s back pic.twitter.com/GWyFYj4OY0
ముఖ్యంగా ఈ సినిమాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును విలన్గా చిత్రీకరించి తెరకెక్కించడంతో ఎలక్షన్ కమిషన్ ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసేంతవరకు రిలీజ్ చేయెద్దని ఆర్డర్ వేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఏపీలో ఈ సినిమా రిలీజ్కు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ సినిమాను మే 1న రిలీజ్ చేయబోతున్నట్టు వర్మ తన ట్విట్టర్లో ప్రకటించాడు. ఇప్పటికే తెలంగాణతో పాటు ఏపీలో కొంత మంది ప్రజలు ఈ సినిమాను వేరే ప్రాంతాల్లో చూసేసారు. సినిమాలో స్టోరీ సహా అన్ని లీకైన తర్వాత ఏపీలో రిలీజ్ కాబోతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఆంధ్ర బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని నమోదు చేస్తుందో చూడాలి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.