హోమ్ /వార్తలు /సినిమా /

లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫస్ట్ డే కలెక్షన్స్.. బాక్సు బద్దలైందిగా..

లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫస్ట్ డే కలెక్షన్స్.. బాక్సు బద్దలైందిగా..

లక్ష్మీస్ ఎన్టీఆర్ లుక్

లక్ష్మీస్ ఎన్టీఆర్ లుక్

మొత్తానికి వివాదాలతో మొదలైన రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు ఏపీ కాకుండా  విడుదలైన అన్ని ఏరియాల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఎంత వసూలు చేసిందంటే..

మొత్తానికి వివాదాలతో మొదలైన రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు ఏపీ కాకుండా  విడుదలైన అన్ని ఏరియాల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. 1989లో ఎన్టీఆర్ ఓటమిపాలైన తర్వాత లక్ష్మీ పార్వతి అన్నగారి జీవితంలో ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటన నేపథ్యంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కించాడు రామ్ గోపాల్ వర్మ. అంతా కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.ఈ  సినిమాను రామ్ గోపాల్ వర్మ..తనదైన కోణంలో చంద్రబాబు పాత్రను విలన్‌గా చిత్రీకరించి.. లక్ష్మీ పార్వతి పాత్రను ఉదాత్తమైనదిగా ఈ సినిమాలో చూపించడం కొంత మందికి నచ్చకపోయినా ..ఓవరాల్‌గా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా దుమ్ముదులుపుతోంది. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ తొలి రోజు ఓవర్సీస్‌ అమెరికాలో 125 స్క్రీన్స్‌లో విడుదలైంది. గురువారం ప్రదర్శించిన ప్రివ్యూలతో ఈ సినిమా 90 వేల డాలర్లకు పైగా వసూలు చేసినట్టు సమాచారం. శుక్రవారంతో కలిపి ఓవరాల్‌గా 1 లక్ష 45 వేల డాలర్లు పైగా వసూలు చేసినట్టు టాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.


Ram Gopal Varma's Lakshmi's NTR Movie Review,Lakshmi's NTR Movie Review | ఎపుడైతే బాలకృష్ణ..వాళ్ల నాన్న ఎన్టీఆర్ జీవిత కథపై సినిమా చేస్తున్నా అని అనౌన్స్ చేసాడో..అప్పుడే  రామ్ గోపాల్ వర్మ..‘లక్ష్మీస్ ఎన్టీఆర్’  సినిమాను అనౌన్స్ చేసాడు.రామ్ గోపాల్ వర్మ మాత్రం ఎన్టీఆర్ ..తెలుగు దేశం వ్యవస్థాపక దినోత్సవమైన మార్చి 29న అనుకోకుండా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఎన్టీఆర్ జీవిత చరమాంకంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్‌తో ప్రజలకు వర్మ ఏం చూపెట్టాడో మన  మూవీరివ్యూలో చూద్దాం..,Lakshmi's NTR : లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రివ్యూ..వర్మ మార్క్ ‘ఎన్టీఆర్’..,Lakshmi's NTR Movie Review,Lakshmis NTR Movie Review,Ram Gopal Varma Lakshmis NTR Movie Review,Ram Gopal Varma,RGV Lakshmi's NTR,RGV Lakshmis NTR,Tollywood News,Telugu Cinema,Andhra Pradesh News,Andhra Pradesh Politics,లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రివ్యూ,రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రివ్యూ,వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రివ్యూ,రామ్ గోపాల్ వర్మ,ఏపీ న్యూస్,ఏపీ పాలిటిక్స్,
లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫైల్ ఫోటో


ఇక తెలుగు రాష్ట్రమైన తెలంగాణతో పాటు కర్ణాటకలో రిలీజైన ఈసినిమాకు చాలా చోట్ల హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అయింది. ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.4 కోట్ల గ్రాస్..రూ. 2 కోట్ల షేర్ రాబట్టింది. వీకెండ్స్ అయిన శని,ఆదివారాల్లో ఈ సినిమాకు ఆక్యుపెన్షీ పెరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ ఫస్ట్ డే కలెక్షన్స్‌తోనే పెట్టిన పెట్టుబడిని వెనక్కి రాబట్టిన ఈ సినిమా ముందు ముందు ఎంత కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.


 First published:

Tags: Box Office Collections, Lakshmis NTR, Lakshmis NTR Movie Review, NTR, NTR Biopic, Ram Gopal Varma, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు