Home /News /movies /

LAKSHMIS NTR MOVIE CHANDRABABU CHARACTER ACTOR SRITEJ SPECIAL INTERVIEW WITH NEWS18 TELUGU NK

వంగవీటి టర్నింగ్ పాయింట్... చంద్రబాబు పాత్ర స్పెషల్ పాయింట్... లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో చంద్రబాబు పాత్రధారి శ్రీతేజ్

శ్రీతేజ్, లక్ష్మీస్ ఎన్టీఆర్ నటుడు

శ్రీతేజ్, లక్ష్మీస్ ఎన్టీఆర్ నటుడు

Lakshmi's NTR : తొలిసారి శ్రీతేజ్ పాత్రను రాంగోపాల్ వర్మ పరిచయం చేసినప్పుడు ఈ వ్యక్తి ఎవరో గుర్తుపట్టగలరా అన్నప్పుడు... ప్రజలు శ్రీతేజ్ కంటే ఆయనలో చంద్రబాబు పాత్రనే గుర్తుచేసుకున్నారు.

(బాలకృష్ణ - సీనియర్ కరెస్పాండెంట్ - న్యూస్18తెలుగు)
సెన్సేషనల్ మూవీ లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో మిగతా పాత్రధారులంతా ఒక ఎత్తైతే... చంద్రబాబు పాత్రలో జీవించినంతపనిచేసి ప్రేక్షకుల మన్ననలు పొందాడు శ్రీతేజ్. ఇదివరకు వంగవీటి సినిమాతో సీనీ పరిశ్రమ దృష్టిని తనవైపు మళ్లించుకున్న శ్రీతేజ్... ఇప్పుడు చంద్రబాబు పాత్రలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. నిజానికి శ్రీతేజ్ కొత్తగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి రాలేదు. 13 ఏళ్లుగా ఎన్నో ఎత్తుపల్లాల్ని చూశాడు. ఏదీ సరైన గుర్తింపు ఇవ్వలేదు. చివరకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ బ్రేక్ ఇచ్చింది. సినిమా విజయం సాధించిన సందర్భంగా శ్రీతేజ్‌తో న్యూస్ 18 తెలుగు టీం స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది. ఆయన మనసులో అభిప్రాయాన్ని మనతో పంచుకుంది.

చంద్రబాబు గెటప్‌లో శ్రీ తేజ్


అసలు ఈ అవకాశం ఎలా వచ్చిందంటే : వంగవీటి సినిమా తరువాత నేను... నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాను. ఆ టైంలో వర్మగారు ఏదో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారని తెలిసింది. అందులో ఏదైనా పాత్ర ఉంటుందేమోనని వెళ్లి కలిశాను. అగస్త్యమునిగారు అప్పటికే చంద్రబాబు పాత్ర కోసం ఎవరు సెట్టవుతారా అని చూస్తున్నారు. ఆ పాత్ర కోసం నేను ఇంట్లో మేకప్ వేసుకొని అద్దం ముందు చూసుకున్నాను. మా అమ్మతో ఫొటో షూట్ చేయించుకొని... ఆ ఫొటోలను వర్మ గారికి పంపాను. వెంటనే ఆయన ఫోన్ చేశారు. రేపటి నుంచే షూటింగ్‌కి వచ్చేయ్ అన్నారు.

మేకప్ రూంలో శ్రీ తేజ్


లక్ష్మీస్ ఎన్టీఆర్‌కి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ : నిజానికి బెస్ట్ కాంప్లిమెంట్ అనేది సినిమా రిలీజ్ అయ్యాక వస్తుంది. నాకు షూటింగ్ మొదలైన రోజే వచ్చింది. చంద్రబాబు గెటప్‌లో కారవ్యాన్ దిగగానే అందరూ న్ను చూసి షాక్ అయ్యారు. అచ్చం చంద్రబాబులాగే ఉన్నావని కొందరన్నారు. ఆ రోజు ప్రశంసల్ని నేను ఇప్పటికీ మర్చిపోలేను. సినిమా రిలీజయ్యాక కూడా అలాంటి ప్రశంసలే వచ్చాయి.

బెదిరింపులేవైనా వచ్చాయా : అయ్యో... అదేం లేదండి. కాకపోతే... వంగవీటి సినిమా చేస్తున్నప్పుడు ఓ నలుగురు వచ్చి బెదిరించారు. చిన్న కుర్రాళ్లే. సినిమా తేడాగా వచ్చిందో, నువ్వు అయిపోతావ్ అన్నారు.

చంద్రబాబు స్టైల్లో శ్రీ తేజ్


టాలీవుడ్‌లోకి ఎంట్రీ : దాదాపు 13 ఏళ్ల కిందట టాలీవుడ్‌లో అడుగుపెట్టాను. మొదట్లో నేను కో-డైరెక్టర్‌గా చేసేవాణ్ని. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాకి పనిచేశాను. అందులో నటించాను కూడా. అయితే వంగవీటి సినిమా నాకు టర్నింగ్ పాయింట్ అయ్యింది.

అన్నీ పాత్రలూ చేస్తాను : బయోపిక్‌లు మాత్రమే కాకుండా ఇకపై అన్ని రకాల పాత్రలూ చేస్తాను. ఆ దిశగా ప్రయత్నిస్తున్నాను. మంచి స్టోరీ వస్తే ఏ పాత్రైనా చేస్తాను.

రామ్ గోపాల్ వర్మతో శ్రీతేజ్


నెక్ట్స్ ఏంటి : అక్షర అనే సినిమా చేస్తున్నాను. అందులో ఓ మంచి కేరక్టర్ నాది. ఆ సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ కంటే ముందే షూటింగ్ మొదలైంది. ఐతే ఆర్జీవీ సినిమా వల్ల గ్యాప్ తప్పలేదు. మళ్లీ ఇప్పుడు మొదలవ్వబోతోంది... అంటూ తన ప్రజెంట్ ప్రాజెక్టు విశేషాల్ని మనతో పంచుకున్నారు శ్రీతేజ్.
First published:

Tags: Lakshmis NTR, Lakshmis NTR Movie Review, Telugu Cinema News, Telugu Movie News, Tollywood, Tollywood news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు