Lakshmi Manchu: ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎందరో ప్రాణాలను విడుస్తున్నారు. దీని బారినపడి ఎన్నో కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. ఈ నేపథ్యంలో నటి మంచు లక్ష్మి ప్రసన్న సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఈ సందర్భంగా కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు అండగా ఉంటామని తెలిపింది. అందులో భాగంగా లక్ష్మి టీచ్ ఫర్ చేంజ్ అనే ఎన్ జీ ఓ కలిసి 1000 పిల్లలకు విద్య, వైద్యం, ప్రాధమిక అవసరాలను తీర్చనున్నారు. తక్కువ ఆదాయ ఆదాయంగల కుటంబాలను గుర్తించి 1,000 మంది పిల్లలకు విద్య, ట్యూషన్, దుస్తులతో పాటు ఇతర సహాయం అందించనున్నారు. దీనికి సంబంధించి ఆమె తన సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ఇటీవల లాక్డౌన్ ప్రారంభమైంది.. అయితే హైదరాబాద్‌కి వైద్యం కోసం చాలా మంది వేరే ఊర్ల నుంచి ఇక్కడికి వస్తుంటారు. అలాంటి వారికి ప్రస్తుత పరిస్థితుల్లో ఆహారం దొరకడం చాలా కష్టతరం.. ఖరీదైన విషయం. ఈ నేపథ్యంలో ఈ లాక్డౌన్ సమయంలో 1000 భోజనాలు పంపిణీ చేసేందుకు కొన్ని ఆసుపత్రులను ఎంచుకుని.. టీచ్ ఫర్ చేంజ్ టీమ్‌తో కలిసి ప్రతిరోజూ వారికి ఆహారం ఇచ్చి ఆకలిని తీర్చుతున్నామని తెలిపారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ ప్రశంసిస్తూ.. ఈ కష్టకాలంలో కొందరికైనా అండగా ఉండడంతో గొప్ప విషయమని కామెంట్స్ చేస్తున్నారు.
Can you imagine the torment a child is going through when he/she loses a parent to covid-19? Do you know anyone who has lost their parents? Imagine the adverse effects that can be caused on child's growth and mental health because of Parental loss? pic.twitter.com/6uMPA1SXIE
ఇక మంచు లక్ష్మి నటన విషయానికి వస్తే.. తండ్రి నట వారసత్వాన్ని ఒంట బట్టించుకొని కొన్నేళ్ల క్రితమే సినీరంగ ప్రవేశం చేశారు లక్ష్మి. దర్శకేంద్రుని కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో 2011లో వచ్చిన 'అనగనగా ఓ ధీరుడు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైయారు. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత నుండి అడపాదడపా సినిమాలు చేస్తోన్న లక్ష్మికి సరైన బ్రేక్ రాలేదు. అయితే లక్ష్మి ఇటూ సినిమాలు చేస్తూనే అటూ బుల్లితెర మీద ప్రోగ్రామ్స్ చేస్తూ తెలుగువారిని అలరిస్తోంది. తెలుగు తెరకు పరిచయం కాక ముందు లక్ష్మి, 'లాస్ వెగాస్', 'డెసపరేట్ హౌజ్ వైవ్స్' లాంటీ కొన్ని అమెరికన్ టెలివిజన్ షోస్‌లలో నటించింది.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.