మంచు లక్ష్మి, తండ్రి నట వారసత్వాన్ని ఒంట బట్టించుకొని కొన్నేళ్ల క్రితమే సినీరంగ ప్రవేశం చేశారు. దర్శకేంద్రుని కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో 2011లో వచ్చిన 'అనగనగా ఓ ధీరుడు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత నుండి అడపాదడపా సినిమాలు చేస్తోన్న లక్ష్మికి సరైన బ్రేక్ రాలేదు. అయితే లక్ష్మి ఇటూ సినిమాలు చేస్తూనే అటూ టెలివిజన్ షోలు చేస్తూ.. తెలుగువారిని అలరిస్తోంది. తెలుగు తెరకు పరిచయం కాక ముందు లక్ష్మి, 'లాస్ వెగాస్', 'డెసపరేట్ హౌజ్ వైవ్స్' లాంటీ కొన్ని అమెరికన్ టెలివిజన్ షోస్‌లలో నటించింది. అది అలా ఉంటే లక్ష్మి చిన్ననాటి ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో చిన్నారి లక్ష్మి తాచుపామును పట్టుకుని ధైర్యంగా ఫోటోకు పోజులిచ్చింది. దీంతో ప్రస్తుతం ఆ ఫోటోపై నెటిజన్స్ తెగ కామెంట్స్ పెడుతున్నారు. లక్ష్మి మీరూ అప్పట్లోనే చాలా ధైర్యంగా ఉన్నారని.. సూపర్ క్యూట్‌గా ఉన్నావంటూ కామెంట్స్ పెడుతూ.. తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
View this post on Instagram
లక్ష్మి మంచు ఫోటోస్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Manchu Lakshmi, Telugu Cinema News