హోమ్ /వార్తలు /సినిమా /

అక్కా హ్యాపీ బర్త్‌డే ... మంచులక్ష్మీకి మనోజ్ విషెస్

అక్కా హ్యాపీ బర్త్‌డే ... మంచులక్ష్మీకి మనోజ్ విషెస్

మంచు లక్ష్మీతో మనోజ్

మంచు లక్ష్మీతో మనోజ్

తనన అక్క పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. నా ప్రియమైన సోదరి, నా డార్లింగ్, నా ఫ్రెండ్ అయిన అక్కకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ మనోజ్ ట్వీట్ చేశాడు.

ఇవాళ టాలీవుడ్ ప్రముఖ నటుడు, డైలాగ్ కింగ్... మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ పుట్టినరోజు. ఈ సందర్భంగా లక్ష్మీకి బర్తడే విషెస్ తెలిపాడు తమ్ముడు మంచు మనోజ్. తన అక్క పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. నా ప్రియమైన సోదరి, నా డార్లింగ్, నా ఫ్రెండ్ అయిన అక్కకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నా జీవితంలో నువ్వు బెస్ట్ థింగ్ అంటూ ట్వీట్ చేశాడు మంచు మనోజ్. అంతేకాదు లక్స్మీ మంచు చీరలో ఉన్న ఫోటోను కూడా పోస్టు చేశాడు.

మంచు మోహన్ బాబు కుటుంబంలో ఇద్దరు కుమారులు, కుమార్తె మంచు లక్ష్మీ కూడా అనేక సినిమాల్లో నటించారు. ఆమె ఇంగ్లీష్‌తో పాటు.. తెలుగు, తమిళ సినిమాల్లో యాక్ట్ చేశారు. ఎన్నారై శ్రీనివాస్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. అనగనగా ధీరుడు సినిమాలో ఆమె నటనకు 2012 నంది అవార్డ్ కూడా అందుకున్నారు మంచు లక్ష్మీ.

First published:

Tags: Manchu Family, Manchu Lakshmi, Manchu Manoj, Tollywood, Tollywood news, Twitter

ఉత్తమ కథలు