హోమ్ /వార్తలు /సినిమా /

విజయ దశమి కానుకగా లక్ష్ చదలవాడ 'ధీర' ప్రీ లుక్ రిలీజ్

విజయ దశమి కానుకగా లక్ష్ చదలవాడ 'ధీర' ప్రీ లుక్ రిలీజ్

Dheera Photo Twitter

Dheera Photo Twitter

Laksh Chadalavada: 'వలయం' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న లక్ష్ చదలవాడ.. 'ధీర' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

భిన్న జానర్లు, కొత్త కథలను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోలు అయితే వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ పరంగా మంచి ఫామ్‌లో ఉన్నారు. అదే బాటలో వెళుతున్నారు హీరో లక్ష్ చదలవాడ (Laksh Chadalavada). 'వలయం' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఆయన.. 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి విమర్శకుల ప్రశంసలందుకున్నారు. ఇప్పుడు అదే జోష్ లో మరో ప్రాజెక్టులో భాగమవుతున్నారు లక్ష్ చదలవాడ. 'ధీర' (Dheera) అనే పేరుతో ఈ సినిమాను గ్రాండ్ గా రూపొందిస్తున్నారు.

విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సరికొత్త కథాంశంతో ఈ 'ధీర' సినిమాను రూపొందిస్తున్నారు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రాబోతోంది. పలు సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించిన సాయి కార్తీక్ ఈ సినిమాకు బాణీలు కడుతున్నారు. ధీర సినిమాకు సంబంధించి ఇది వరకు విడుదల చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది.

అయితే దసరా కానుకగా ఈ మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. హీరో లక్ష్ చదలవాడ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 9న ఉదయం 9 గంటలకు ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయబోతోన్నట్టుగా మేకర్లు ప్రకటించారు. ఈ క్రమంలో ధీర ప్రీ లుక్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. ఇందులో లక్ష్ చదలవాడ యాక్షన్‌లోకి దిగేట్టు కనిపిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు మేకర్లు తెలిపారు.

ఈ చిత్రంలో లక్ష్ చదలవాడ, నేహా పతన్, సోన్యా భన్సాల్, మిర్చి కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడీ, వైవా రాఘవ్, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ కూడా అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

Published by:Sunil Boddula
First published:

Tags: Cinema, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు