విజయశాంతి రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

Vijayashanti : విజయశాంతి.. ఈ పేరుకు సపరేటు రూటు ఉంది.. డైనమిజం ఉంది.. స్టామినా ఉంది.. అన్నింటికీ మించి పవర్ ఉంది. అందుకే తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారామె.

news18-telugu
Updated: January 24, 2020, 9:45 AM IST
విజయశాంతి రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
‘సరిలేరు నీకెవ్వరు’లో విజయశాంతి (Twitter/Photo)
  • Share this:
విజయశాంతి.. ఈ పేరుకు సపరేటు రూటు ఉంది.. డైనమిజం ఉంది.. స్టామినా ఉంది.. అన్నింటికీ మించి పవర్ ఉంది. అందుకే తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారామె. సినిమాలైనా, రాజకీయాలైనా సరే.. దూకుడు ఆమె నైజం. ఆ దూకుడుతోనే తన పేరు మార్మోగేలా చేసుకున్నారు. లేడీ సూపర్ స్టార్‌గా, లేడీ అమితాబ్‌గా పేరున్న ఈమె.. స్క్రీన్‌పై కనిపిస్తే అభిమానులు విజిలేస్తారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పవర్ ఫుల్ స్టార్ అయ్యారామె. తర్వాత సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. మళ్లీ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా రీఎంట్రీ ఇచ్చారు. రీఎంట్రీలో భారతిగా మరో పవర్‌ఫుల్ కేరెక్టర్ చేసి తన స్టామినాను మరోసారి నిరూపించారు.

అయితే.. రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు? సినిమాల్లో నటించడానికి ఏయే నిర్ణయాలు తీసుకున్నారు? తదితర ప్రశ్నలు ఆమె అభిమానులు, ప్రేక్షకుల మదిని తొలుస్తూనే ఉన్నాయి. అయితే, సినీ వర్గాల సమాచారం ప్రకారం ఆమె ఈ సినిమాకు ఏకంగా రూ.1.5 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఆ మొత్తం సినిమాలో హీరోయిన్‌గా నటించిన రష్మిక మందన్నా తీసుకున్న రెమ్యునరేషన్‌ కంటే ఎక్కువేనని టాక్.

అంతేనా.. రాములమ్మ కొన్ని కండీషన్లు కూడా పెడుతోందట. స్టార్ హీరో సినిమాల్లోనే చేస్తానని, చిన్న హీరోల సినిమాల్లో చేయనని స్పష్టం చేస్తున్నారట. హీరోకి ఇచ్చే కంఫర్టులు, పోస్టర్‌పై ప్రాధాన్యం ఉండాలని తెగేసి చెబుతున్నట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక అన్నింటికంటే.. ముందు కథ చెప్పిన విధంగానే పాత్ర నిడివి ఉండాలని స్పష్టం చేస్తోందట.

First published: January 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు